శబరిమలపై సుప్రీం సంచలన తీర్పు

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఆలయంలోకి మహిళలు రాకుండా అడ్డుకోవడం సరైనది కాదని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. స్త్రీ కూడా దేవుడు సృష్టించిన సృష్టేనని.. పనిచేసే చోట, పూజించే చోట ఈ భేదాభావం ఎందుకని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఆలయం ప్రజల ఆస్తి అని, ప్రైవేట్ వ్యవహారం కాదని వ్యాఖ్యానించింది. పూజలో పాల్గొనడానికి అందరికి సమాన హక్కులు ఉంటాయని, మహిళలను అడ్డుకోవడం అంటే రాజ్యాంగ హక్కును కాలరాసినట్టేనని కోర్టు స్పష్టం చేసింది.ఆలయంలోకి ఎవరికైనా ప్రవేశముంటుందని ఈ తీర్పు తక్షణమే అమల్లోకి వస్తుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పునిచ్చారు.