పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు… నేటి ధరలివే

అమెరికా, చైనా వ్యాపార సంబంధాల్లో అనిశ్చితి నెలకొనడంతో అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. భారత్ లో కూడా స్వల్పంగా రేట్లు పెరిగాయి. శుక్రవారం నాడు దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు 19 నుంచి 32 పైసల మధ్య పెరిగాయి.

దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర 19పైసలు పెరిగి రూ.69.07కు చేరింది. లీటరు డీజిల్‌ ధర 28పైసలు పెరిగి రూ.62.81గా ఉంది.

ముంబయిలో ఇవాళ పెట్రోల్‌ ధర 19పైసలు పెరిగింది. దీంతో లీటరు పెట్రోల్‌ రూ.74.72కు చేరింది. డీజిల్‌ లీటరుకు 30పైసలు పెరిగి రూ.65.73గా ఉంది.

చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.71.67కు, లీటరు డీజిల్ ధర రూ.66.31కు చేరాయి.

కోల్‌కతాలో లీటరు పెట్రోల్‌ ధర రూ.71.20కు చేరగా, లీటరు డీజిల్‌ ధర రూ.64.58గా ఉంది.

హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర పై 20 పైసలు పెరిగి లీటర్ పెట్రోల్ ధర 73.27 రూపాయలు, డీజిల్ ధర 32 పైసలు పెరిగి లీటర్ 68.28 రూపాయలుగా ఉంది.