దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తం బెనిఫిట్ పొందాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా చేసే స్కీమ్స్ నేషన్ల్ పెన్షన్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో ఎవరైతే డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లు రిటైర్మెంట్ తర్వాత భారీ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు ఇతర ప్రయోజనాలను సైతం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 25 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు నెలకు 1500 ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత 57 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.
ఇలా ఒకేసారి మొత్తం పొందకుండా నెలనెలా పెన్షన్ లా కూడా పొందే విధంగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే రూ.28,712 పెన్షన్ గా లభిస్తుంది. యాన్యుటీ ప్లాన్ లా తీసుకుంటే నెలకు రూ.11,485 పెన్షన్ తో పాటు రూ.34 లక్షలను విత్ డ్రా చేసుకోవచ్చు. నెలకు 3000 రూపాయలు డిపాజిట్ చేస్తే మాత్రం ఏకంగా నెలకు 57,000 రూపాయల పెన్షన్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
రిటైర్ అయిన తర్వాత ఏకంగా కోటి రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. పరిస్థితులను బట్టి రిటర్న్ రేటు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత ఎక్కువ మొత్తం పొందినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ లను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి విషయాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రభుత్వ పథకాల గురించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉంటే మంచిది.
ఇప్పుడు ఇన్వెస్ట్ చేయని పక్షంలో భవిష్యత్తులో తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. చిన్న వయస్సులోనే ఈ స్కీమ్స్ లో పెట్టుబడి పెట్టడం మొదలుపెడితే మంచిదని చెప్పవచ్చు. ఈ స్కీమ్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ఆన్ లైన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.