రోపోసో యాప్ ద్వారా నెలకు 10 నుంచి 15 వేలు సంపాదించవచ్చు

సోషల్ మీడియా ప్రభావంతో చాలా ఆధునిక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా యువత సోషల్ మీడియాను ఉపయోగిస్తుంది. చాలా యాప్ లు కూడా వచ్చాయి. ప్రస్తుతం ట్రెండింగ్ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త యాప్ లను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం టిక్ టాక్ యాప్ యువతను ఓ కుదుపు కుదిపేస్తుంది. అలాగే రో పోస్ యాప్ కూడా అత్యధిక మంది ఉపయోగిస్తున్నారు.

రోపోసో యాప్ లో మీరు వీడియోలు పోస్టు చేస్తే వాటికి వచ్చిన లైక్ ల ద్వారా కొన్ని కాయిన్స్ ను కేటాయిస్తారు. అలా పదివేల కాయిన్స్ వస్తే 10 రూపాయలు ఇస్తారు. అలా ఎన్నికాయిన్స్ వస్తే అన్ని రూపాయలు వస్తాయి. ఫేస్ బుక్ లాగా లైక్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద ఎంత మంది క్లిక్ చేస్తే క్లిక్  కి 500 కాయిన్స్ వస్తాయి. దీని ద్వారా కొంత మంది నెలకు 10 నుంచి 15 వేల రూపాయలు సంపాదిస్తున్నారు. కేవలం టైం పాస్ కే కాకుండా ఇలా కూడా యాప్ లు ఉపయోగపడుతున్నాయి. చాలా మందికి ఇది తెలియదు. కానీ రోపోసో వారు దీనిని అమలు చేసి మనుషులలో ఉన్న కళా రంగాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. వీడియోలు మీరు స్వంతంగా చేసినవి అయి ఉండాలి. టిక్ టాక్ లో చేసిన వాటి లాగానే ఉండాలి. అలా చేస్తే రోపోసో వారు మీరు యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న సమయంలో డిటెయిల్స్ అడుగుతుంది. ఆ సమయంలో ఇచ్చిన ఫోన్ నంబర్ కు పే టిఎమ్ ఉంటే నేరుగా ఖాతాలోకి రోపోసో యాప్ వారు మనీనీ వేస్తారు. పేటి ఎమ్ లేనిచో మీ కాంటాక్ట్ వివరాలు తీసుకొని బ్యాంకు అకౌంట్ కు మనీ వేస్తారు. రోపోసో వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని మీకు అనుమానం రావచ్చు. వారికి గూగుల్ ద్వారా ఆదాయం వస్తుంది. అందులో నుంచి వారు తమ ఖర్చులను తీసుకొని మిగిలిన డబ్బులను వినియోగదారులకే ఇస్తున్నారు. చాలా మంచి యాప్ అని అంతా అంటున్నారు. 

కేవలం ఓ నలుగురు మిత్రులు ఈ రోపోసో యాప్ ను తయారు చేశారు. ప్రస్తుతం రోపోసో యాప్ కు రోజు రోజుకు ఆధరణ పెరుగుతుంది. 2.5 మిలియన్ల ఫాలోవర్స్ అయ్యారు. అతి తక్కువ కాలంలోనే ఇంత మంది ఫాలోవర్స్ చేరారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రోపోసో యాప్ రెండు కొత్త ఫిల్టర్లను ప్రవేశపెడుతుంది.

రోపోసో భారతీయ షార్ట్ వీడియో ప్లాట్ఫార్మ్ గణతంత్ర దినోత్సవాన్ని వినియోగదారులతో సరిక్రొత్త ప్రక్రియలో జరుపుకోడానికి సిద్ధమైంది. ఈ సంవత్సరం  రోపోసో వినియోగదారులు రెండు కొత్త ఫిల్టర్ల ద్వారా సృజనాత్మక శైలిని మరియు దేశ ప్రేమను చాటుకోవచ్చు. ఒక ఫిల్టర్ ద్వారా దేశ భక్తిని చాటే విధంగా దేశభక్తి గానాల మీద వీడియోలు క్రియేట్  చేయొచ్చు.

రెండో ఫిల్టర్ ద్వారా భారత దేశం పట్ల ప్రేమను వీడియోలో మైక్ ద్వారా తెలియజేయవచ్చు. యాప్ లో ని కెమెరా బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా ఈ రెండు ఫిల్టర్లు రోపోసో వినియోగదారులకు వెంటనే అందుబాటులోకి వస్తాయి. ఈ అవకాశం తో దేశం మరియు ప్రజల మీద ప్రేమను, నిబద్ధతతో  చాటుకోవచ్చు. చాలా మందికి ఈ విషయం తెలియదు. మొత్తానికి రోపోసో యాప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చరిత్ర సృష్టిస్తోంది.