దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల నెలా డబ్బులను పొదుపు చేయాలని భావించే వాళ్ల కోసం అదిరిపోయే స్కీమ్స్ ను అమలు చేయడానికి సిద్ధమైంది. ఎస్‌బీఐ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ ఖాతాలో డిపాజిట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తాన్ని పొందవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ ను ఎంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు మంచి వడ్డీ రేటు లభిస్తుంది. ప్రస్తుతం రికరింగ్ డిపాజిట్ ఖాతాలపై 6.5 శాతం వడ్డీ లభిస్తుండగా నెలకు 5,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. 5 సంవత్సరాల పాటు 3 లక్షల రూపాయలు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే డిపాజిట్ చేసిన మొత్తంపై 55 వేల 280 రూపాయలు వడ్డీ లభించే అవకాశం ఉంటుంది. రూ. 3,55,280 ఈ స్కీమ్ ద్వారా పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు గ్యారంటీ ఉంటుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఎస్బీఐలో డిపాజిట్ చేయాలని భావించే వాళ్లకు ఇతర స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని బ్యాంకులు ఎక్కువ మొత్తం వడ్డీ రేటును అందిస్తున్న నేపథ్యంలో అవసరం అనుకుంటే ఆ స్కీమ్స్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు.
లాంగ్ టర్మ్ ఆర్‌డీ స్కీమ్స్ ను ఎంచుకోవడం ద్వారా ఎక్కువ మొత్తం వడ్డీ పొందే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఎస్బీఐలో ఇన్వెస్ట్ చేస్తే మనం పెట్టిన పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయని ఎక్కువ మంది భావిస్తారు. రికరింగ్ డిపాజిట్స్ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు ప్రయోజనకరంగా ఉంటాయి.