శనివారం మార్కెట్ లో బంగారం, వెండి ధరలివే

ఫిబ్రవరి నెలలో పెళ్లిల సీజన్ కావడంతో బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఫిబ్రవరి, మార్చిలో మంచి ముహుర్తాలు ఉండడంతో బంగారానికి గిరాకి పెరిగింది. రేటు పెరిగినా అవసరం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు.

వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ. 34, 280, విజయవాడలో రూ. 33,800, విశాఖపట్నంలో రూ. 34,400, ప్రొద్దుటూరులో రూ. 33,660, చైన్నైలో రూ. 33,330 గా ఉంది.

ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ. 31,740, విజయవాడలో రూ. 31,130, విశాఖ పట్నంలో రూ. 31,640, ప్రొద్దుటూరులో రూ. 31,210, చెన్నైలో రూ. 31,860 గా ఉంది.

వెండి కిలో ధర హైదరాబాదులో రూ. 41,300, విజయవాడలో రూ. 41,800, విశాఖపట్నంలో రూ. 41,700, ప్రొద్దుటూరులో రూ. 41,400, చెన్నైలో రూ. 43,800 గా ఉంది.