సులువుగా రూ.5 వేల పొదుపుతో చేతికి రూ.3 లక్షల 72 వేలు.. ఎలా అంటే?

ప్రతి నెలా బ్యాంక్ లో డబ్బులు పొదుపు చేసి దీర్ఘకాలంలో బెనిఫిట్ పొందాలని చాలామంది భావిస్తుంటారు. రికరింగ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏకంగా 8 శాతానికి పైగా వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. చిన్న మొత్తంలో డబ్బులను పొదుపు చేయాలని భావించే వాళ్లు రికరింగ్ డిపాజిట్ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం ఈ విధంగా పొదుపు చేస్తే మంచిది.

లాంగ్ టర్మ్ ఆర్‌డీలు ఎంచుకోవడం ద్వారా ఎక్కువ మొత్తం వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో పొందే మొత్తాన్ని తెలుసుకుని సులువుగా రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు వడ్డీ రేటులో ఎలాంటి మార్పు ఉండకపోవడంతో ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌ కావాలని కోరుకునే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది.

రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులపై లోన్ పొందే అవకాశం కూడా ఉండటంతో ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు గరిష్టంగా 8.25 శాతం వడ్డీ రేటును అందిస్తుండటం గమనార్హం. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోల్చి చూస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమని చెప్పవచ్చు. టెన్యూర్ ఆధారంగా ఈ స్కీమ్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే మొత్తం 3 లక్షల రూపాయలు కాగా ఆ మొత్తంపై వడ్డీ రూపంగా ఏకంగా 72 వేల రూపాయలు వస్తాయి. దీర్ఘకాలంలో పొదుపు చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంక్ లలో కూడా డబ్బులను సులువుగా ఇన్వెస్ట్ చేయవచ్చు.