మనలో చాలామంది సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలని అనుకుంటూ ఉంటారు. సంపాదించిన డబ్బును తెలివిగా పొదుపు చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్న స్కీమ్స్ ను ఎంచుకోవడం ద్వారా మంచి రిటర్న్స్ పొందే అవకాశాలు ఉంటాయి. డిపాజిట్లు, సంపాదించిన వడ్డీ, విత్‌డ్రా అమౌంట్ పై ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ మొత్తం పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఈ స్కీమ్ లో 50 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 2.25 కోట్ల రూపాయల కార్పస్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వడ్డీ రూపంలో ఈ స్కీమ్ ద్వారా కోటీ 74 లక్షల రూపాయలు పొందవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. పీపీఎఫ్‌పై సబ్‌స్క్రైబర్‌లకు ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ లభిస్తుంది.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన డబ్బులను 5 సంవత్సరాల బ్లాక్ లో పొడిగించే ఛాన్స్ అయితే ఉంటుంది. దేశంలోని పౌరులెవరైనా పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. 60 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేయాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెట్టవచ్చు.
పీపీఎఫ్‌లో జమ చేసిన రూ.2 కోట్లకు పైబడిన మొత్తానికి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. భార్యాభర్తలిద్దరూ కలిసి 35 ఏళ్ల పాటు పీపీఎఫ్ అకౌంట్‌ని నిర్వహించడం ద్వారా 4 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని పొందవచ్చు. ప్రస్తుతం ఉన్న స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ బెస్ట్ స్కీమ్ గా ఉంది.