రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లు పోస్టాఫీస్ స్కీమ్స్ పై దృష్టి పెడితే మంచిది. 60 సంవత్సరాల తర్వాత కూడా ఆదాయం కావాలని కోరుకునే వాళ్లు డబ్బు సంపాదించలేని పరిస్థితుల్లో కూడా ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసుకుంటే మంచిది. వయస్సు పెరిగే కొద్దీ ఖర్చులు పెరగడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఆదాయం తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
నెలనెలా కొంత మొత్తం పొదుపు చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చిన్న మొత్తమే ఎక్కువ మొత్తం అవుతుంది. తల్లీదండ్రులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని కోరుకునే పిల్లలు సైతం ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కం స్కీమ్ తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని అందించే స్కీమ్స్ లో ఒకటిగా ఉంది. ఈ స్కీమ్ వడ్డీ రేటు ప్రస్తుతం 7.4 శాతంగా ఉంది.
బ్యాంకు వడ్డీ రేట్లతో పోల్చి చూస్తే ఈ మొత్తం ఎక్కువ మొత్తమేనని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు 6,000 రూపాయల చొప్పున వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ డబ్బులను తల్లీదండ్రుల బ్యాంక్ ఖాతాలో జమ చేయవచ్చు. ఎక్కువ మొత్తం డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తం వడ్డీ పొందే అవకాశాలు కూడా ఉంటాయి. ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని బట్టి పొందే మొత్తం మారుతుంది.
ఈ స్కీమ్ కు ఐదు సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు నియమ నిబంధనలను పూర్తిగా తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ ఉండదు. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. గ్యారంటీ ఇన్ కం పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై ఫోకస్ పెడితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.