కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ సర్కార్ ప్రజలకు మరో అద్భుతమైన తీపి కబురును అందించింది. లక్కీ డ్రా ద్వారా ఏకంగా కోటి రూపాయలను గెలుచుకునే అద్భుతమైన అవకాశాన్ని మోదీ సర్కార్ అందిస్తోంది. మేరా బిల్ మేరా అధికార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం.
200 రూపాయల కంటే ఎక్కువ విలువైన వస్తువులను కొనుగోలు చేసిన వాళ్లు ఇన్ వాయిస్ లను అప్ లోడ్ చేయడం ద్వారా ఈ మొత్తాన్ని పొందవచ్చు. వస్తువులు కొనుగోళ్లు చేసినప్పుడు ఇన్‌వాయిస్‌లను అడిగే విధంగా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా వ్యాపార సంస్థలు జీఎస్టీకి సంబంధించి మోసాలు చేస్తే ఆ మోసాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.
ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ స్కీమ్ అమలవుతుండగా రాబోయే రోజుల్లో మరిన్ని ఎక్కువ రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమలు దిశగా అడుగులు పడనున్నాయి. రిజిస్టర్డ్ సప్లయర్లు ఇచ్చిన ఇన్‌వాయిస్‌లను అప్ లోడ్ చేయడం ద్వారా లక్కీ డ్రాకు సులువుగా అర్హత పొందవచ్చు. ఒక నెలలో గరిష్ఠంగా 25 ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్ చేసే అవకాశం ఉండటంతో ఎక్కువగా షాపింగ్ చేసేవాళ్లకు ఈ స్కీమ్ ప్రయోజనకరంగా ఉంటుంది.
గత నెలలో జారీ చేసిన ఇన్ వాయిస్ లను వచ్చే నెల ఐదో తేదీలోగా అప్ లోడ్ చేయాలి. మంత్లీ డ్రాలో 800 మందిని ఎంపిక చేస్తారు. బంపర్ డ్రాలో ఇద్దరు వ్యక్తులు ఏకంగా కోటి రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. యాప్ లేదా వెబ్ పోర్టల్‌లో మెసేజ్ లేదో నోటిఫికేషన్ ద్వారా విజేతల వివరాలను వెల్లడిస్తారు. 12 నెలల పాటు ఈ స్కీమ్ అమలులో ఉండనుంది.