కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రాష్ట్రంలోని ప్రజలకు మేలు జరిగేలా ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్స్ ను అమలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సూర్యోదయ యోజన పేరుతో కేంద్రం కొత్త స్కీమ్ ను అమలు చేస్తుండగా అంత తక్కువ ఖర్చుతో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ నిర్మించుకోవాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెట్టవచ్చు. కోటి ఇళ్లపై రూప్ టాఫ్ సోలార్ ను అమలు చేయాలని కేంద్రం ఈ స్కీమ్ ను అమలులోకి తెచ్చింది.
మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్ ఫేజ్-2 లో భాగంగా రూఫ్‌టాప్ సోలార్‌ను లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం. 8 నుంచి 10 శాతం వడ్డీకి పర్సనల్ లోన్స్ ఇచ్చి ఈ స్కీమ్ ను అమలు చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఈ స్కీమ్ ను అమలు చేయడం ద్వారా గ్రిడ్-కనెక్టెడ్ విద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు భోగట్టా.
రూఫ్‌టాప్ ఇన్‌స్టలేషన్‌కు 3.5 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉండగా సులభ వాయిదాల రూపంలో డబ్బును చెల్లించడం ద్వారా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. విద్యుత్ బిల్లులకు సమానమైన మొత్తాన్ని చెల్లించడం ద్వారా ఈ స్కీమ్ ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు రూప్ టాప్ కెపాసిటీ ఆధారంగా ప్రభుత్వం నుంచి పొందే సబ్సిడీలో మార్పులు ఉంటాయి.
ఈ స్కీమ్ ద్వారా రూప్ టాప్ ఇన్ స్టాలేషన్ ను పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకుంటే మంచిది. సూర్యోదయ యోజన స్కీమ్ ద్వారా ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూరే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అధికారులను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.