ఎల్ఐసీ సూపర్ స్కీమ్.. తక్కువ ప్రీమియంతో సులువుగా ఎక్కువ బెనిఫిట్ పొందే ఛాన్స్!

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదిరిపోయే పాలసీలను అమలు చేస్తూ కస్టమర్లకు అంతకంతకూ దగ్గరవుతోంది. ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ ప్లాన్ పేరుతో ఒక ప్లాన్ అమలవుతుండగా ప్రత్యేక టర్మ్ ఇన్స్యూరెన్స్ కు సంబంధించిన ఈ ప్లాన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్స్ పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

ఈ స్కీమ్ ద్వారా పాలసీ హోల్డర్ మరణిస్తే నామినీ డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆన్ లైన్ లో ఈ పాలసీ తీసుకునే అవకాశం ఉండటంతో ఆన్ లైన్ పై కనీస అవగాహన ఉన్నవాళ్లు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు ఎంచుకున్న వార్షిక ప్రీమియంతో పోల్చి చూస్తే ఏడు రెట్లు పొందవచ్చు. రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం ఎంచుకున్న వాళ్లకు ఈ ఆప్షన్ వర్తిస్తుందని చెప్పవచ్చు.

సింగిల్ ప్రీమియం ఎంచుకున్న వాళ్లకు మాత్రం చెల్లించిన ప్రీమియంకు సంబంధించి 125 శాతం పొందే అవకాశం ఉంటుంది. 65 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పాలసీ కేవలం డెత్ బెనిఫిట్ మాత్రమే ఉంటుందని గుర్తుంచుకోవాలి. 20 ఏళ్ల వ్యక్తి రూ.75,603 + జీఎస్‌టీ చెల్లించడం ద్వారా ఈ పాలసీ తీసుకోవచ్చు.

ఆప్షన్ 2 ఎంచుకున్న వాళ్లు మాత్రం రూ.9,345 + జీఎస్‌టీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ ఐదేళ్లు ముగిసిన తర్వాత సమ్ అష్హ్యూర్డ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. నియమనిబంధనలను పూర్తిగా తెలుసుకుని ఈ పాలసీని తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.