ఎల్ఐసీ సూపర్ పాలసీ.. ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే 10 రెట్లు లాభం పొందే అవకాశం?

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అమలు చేస్తుండగా ఈ పాలసీల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలో బెనిఫిట్ కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న పాలసీలలో ధన్ వృద్ధి పాలసీ ఒకటి కాగా ఈ పాలసీలో ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే 10 రెట్లు లాభం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావించే వాళ్లు ఈ పాలసీపై ప్రత్యేక దృష్టి పెడితే మంచిది. సింగిల్ ప్రీమియం పాలసీ అయిన ఈ పాలసీ ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, సేవింగ్స్, సింగిల్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయిన ఈ పాలసీని వెంటనే తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది.

పాలసీ గడువులోగా పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఈ పాలసీ ద్వారా ఆర్థికంగా బెనిఫిట్ కలగనుంది. ఈ పాలసీ సింగిల్ ప్రీమియం పాలసీ కావడంతో ల్యాప్స్ అయ్యే అవకాశం అయితే ఉండదు. కనీస సమ్ అష్యూర్డ్ రూ.1,25,000 కాగా 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీలోని ఒక ఆప్షన్ ను ఎంచుకుంటే చెల్లించిన ప్రీమియం కన్నా 1.25 రెట్లు డెత్ బెనిఫిట్ లభిస్తుంది.

ఈ ఆప్షన్ ను కాకుండా మరో ఆప్షన్ ను ఎంచుకుంటే మాత్రం చెల్లించిన ప్రీమియం కన్నా 10 రెట్లు డెత్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు బెనిఫిట్‌తో పాటు గ్యారెంటీ అడిషన్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు పలు రైడర్స్ అందుబాటులో ఉంటాయి. సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలిసే ఛాన్స్ ఉంటుంది.