మనలో చాలామందికి రోజుకు 50 రూపాయలు పొదుపు చేయడం పెద్దగా కష్టం కాదు. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరి వేతనం 10,000 రూపాయల కంటే ఎక్కువగా ఉండటంతో ఈ మొత్తాన్ని సులువుగానే సేవ్ చేయవచ్చు. అయితే నెలకు 1500 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ లో డిపాజిట్ చేయడం ద్వారా అదిరిపోయే రాబడిని పొందే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
సాధారణ స్కీమ్స్ తో పోల్చి చూస్తే మ్యూచువల్ ఫండ్స్ తో ఎక్కువ రాబడిని పొందే ఛాన్స్ ఉంటుంది. కనీసం 12 శాతం నుంచి 36 శాతం వరకు సులువుగా వడ్డీని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని ఫండ్స్ ఏకంగా 47 శాతం రాబడిని ఇచ్చాయంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఏ స్థాయిలో లాభాలను పొందవచ్చో సులువుగానే అర్థమవుతుంది.
రోజుకు 50 రూపాయల చొప్పున ఏడాదికి 18000 రూపాయలు డిపాజిట్ చేస్తే దీర్ఘ కాలంలో 30 లక్షల రూపాయల బెనిఫిట్ ను పొందే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ తో పోల్చి చూస్తే రిస్క్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ రిస్క్ ను బట్టి కొన్నిసార్లు నష్టపోయే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఈ విషయాలను తపనిసరిగా గుర్తుంచుకోవాలి.
స్టాక్ మార్కెట్ గురించి కనీస అవగాహన లేకపోతే మాత్రం ఈ రంగంలో నిపుణులను సంప్రదించడం ద్వారా ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలను పొందవచ్చు అనే వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. డబ్బుల విషయంలో రిస్క్ చేయగలం అని భావించే వాళ్లు మాత్రమే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి.