దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను రిలీజ్ చేస్తూ ఎల్ఐసీ పాలసీ తీసుకునే వాళ్లకు ఊహించని స్థాయిలో ప్రయోజనాలను అందిస్తోంది. డెత్ బెనిఫిట్స్‌తో పాటు మెచ్యూరిటీ సమయంలో పెద్ద మొత్తంలో నగదు పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. నాన్ లింకెడ్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ అయిన ఈ పాలసీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
బీమా రక్షణతో పాటు పొదుపు ప్లాన్ కోసం చూస్తున్న వాళ్లు ఈ పాలసీపై దృష్టి పెడితే మంచిది. రోజుకు రూ.182 చెల్లిస్తే మెచ్యూరిటీ నాటికి ఏకంగా రూ.16 లక్షల వరకు ఈ పాలసీ ద్వారా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు సమ్ అష్యూర్డ్ ప్లస్ రివర్షనరీ బోనస్, టెర్మినల్ బోనస్‌లు అందే అవకాశాలు ఉంటాయి. ఈ పాలసీ పాలసీదారు అకాల మరణం చెందితే కుటుంబానికి ఆర్థిక రక్షణను అందిస్తుంది.
30 ఏళ్ల వ్యక్తి 10 లక్షల రూపాయల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే 15 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాలి. ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తే 20 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ మొత్తాన్ని దాదాపు రూ.15.5 లక్షలు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. పెట్టుబడులకు అనుగుణంగా ప్రీమియం చెల్లించే అవకాశం ఉండటంతో ఈ పాలసీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఏజెంట్ ద్వారా ఈ పాలసీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
సమీపంలోని ఎల్.ఐ.సీ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా పాలసీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ పాలసీ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో లాభం పొందవచ్చు. కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించాలని భావించే వాళ్లు ఈ పాలసీపై దృష్టి పెడితే మంచిది.