గ్యాస్ సిలిండర్‌పై రూ.400 తగ్గింపు.. ప్రజలకు మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త ఇదే!

gas

గత కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరగడంతో ప్రజలపై ఊహించని స్థాయిలో భారం పడింది. పెరుగుతున్న గ్యాస్ ధరల వల్ల సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉండటంతో మోదీ సర్కార్ గ్యాస్ సిలిండర్ ధరల తగ్గింపు దిశగా అడుగులు వేసింది. గ్యాస్ సిలిండర్ పై 200 రూపాయల ధర తగ్గించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

కేంద్ర కేబినేట్ లో ఈ నిర్ణయం తీసుకోగా తగ్గించిన ధరలు తక్షణమే అమ్మల్లోకి వచ్చాయి. రాఖీ పండుగను పురస్కరించుకుని మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. 2024 ఎన్నికలు పూర్తయ్యే వరకు గ్యాస్ ధరలలో పెంపు ఉండకపోవచ్చని సమాచారం అందుతోంది. 33 కోట్ల మంది వినియోగదారులకు ఈ నిర్ణయం ద్వారా ;ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర 1103 రూపాయలుగా ఉంది.

200 రూపాయలు తగ్గించడంతో గ్యాస్ ధర ఏకంగా 200 రూపాయలు తగ్గనుంది. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వాళ్లకు అదనంగా మరో 200 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర తగ్గనుందని తెలుస్తోంది. ఈ కనెక్షన్ ఉన్నవాళ్లకు 703 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభించనుందని సమాచారం అందుతోంది. దేశంలో గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు 10.35 కోట్లుగా ఉంది.

గత కొన్నేళ్లుగా గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలలో పెద్దగా మార్పులు రాలేదు. మరికొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రంలో మరో మారు అధికారంలోకి రావాలని మోదీ సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరల తగ్గింపు దిశగా అడుగులు పడ్డాయి.