కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా నెలకు 400 రూపాయలు పొందే అవకాశం?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా ఆ పథకాల బెనిఫిట్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. ఒక స్కీమ్ ద్వారా ఏకంగా 400 రూపాయలు బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉంది. వికలాంగుల పెన్షన్ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్ ద్వారా కేంద్రం నుంచి 200 రూపాయలు సహాయం పొందే ఛాన్స్ ఉంది.

భారతదేశంలో శాశ్వతంగా నివసిస్తూ ఉన్నవాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందడానికి అర్హులు. 59 సంవత్సరాల లోపు వయస్సు వాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. దరఖాస్తుదారుడికి మరేదైనా పెన్షన్ స్కీమ్ కింద లబ్ది వస్తూ ఉంటే ఈ స్కీమ్ అర్హతలను పొందలేరు. లబ్దిదారుడు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వ్యక్తి అయితే మాత్రం ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను సులువుగా పొందే ఛాన్స్ ఉంటుంది.

ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ ఫొటో కాపీ, నివాస ధృవీకరణ పత్రం, అంగవైకల్య ధృవీకరణ పత్రం, ఫొటో గుర్తింపు ఐడీ, ఓటరు గుర్తింపు కార్డు షాడో కాపీ, బిపిఎల్ కార్డు షాడో కాపీ, పాస్ పోర్ట్ సైజు ఫొటో, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రం సహాయంతో ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://apdascac.ap.gov.in, http://www.aasara.telangana.gov.in వెబ్ సైట్స్ ద్వారా ఈ స్కీమ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

దరఖాస్తు ఫారంలో పూర్తి సమాచారం నింపడం ద్వారా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను సులువుగా పొందే ఛాన్స్ ఉంటుంది. సమీపంలోని అధికారులను సంప్రదిస్తే ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలు ఉంటాయి.