ప్రస్తుత కాలంలో ఉద్యోగంతో పోల్చి చూస్తే వ్యాపారం చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలో ఆదాయం సొంతం చేసుకోవచ్చు. డిగ్రీ చదివి వ్యాపారం దిశగా అడుగులు వేస్తున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే సొంత వ్యాపారం చేయాలని భావిస్తున్నా తగినంత ఆదాయం లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే డబ్బు లేకపోయినా బిజినెస్ చేయాలని భావించే వాళ్లకు కేంద్రం తీపికబురు అందించింది.
జనరిక్ మందుల షాపులను ఓపెన్ చేయాలని భావిస్తున్న వాళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం లభిస్తోంది. 2024 సంవత్సరం మార్చి సమయానికి జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ కేంద్రాలను ఓపెన్ చేయడం ద్వారా ప్రభుత్వం ఉపాధిని కూడా కలిగిస్తోంది. ఈ కేంద్రాన్ని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఓపెన్ చేస్తే కేంద్రం 50,000 రూపాయల విలువైన మందులను ఉచితంగా ఇస్తుండటం గమనార్హం.
రిటైల్ డ్రగ్ సేల్స్ లైసెన్స్ ఉన్నవాళ్లు సులభంగా జన్ ఔషధి కేంద్రాలను ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నిరుద్యోగ ఫార్మసిస్ట్, డాక్టర్, ట్రస్టులు, ఎన్జీవోలు, ప్రైవేట్ ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల నామినేటెడ్ ఏజెన్సీలు ఈ కేంద్రాలను తెరవవచ్చు. ఈ కేంద్రం కోసం బి-ఫార్మా లేదా డి-ఫార్మా డిగ్రీని కలిగి ఉన్నవాళ్లు సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
డిగ్రీ సర్టిఫికెట్ కు సంబంధించిన జిరాక్స్ ను జత చేయాల్సి ఉంటుంది. అమ్మిన మందులపై 15 శాతం ప్రోత్సాహకాలు లభిస్తాయి. బిజినెస్ చేసి స్థిరపడాలని భావించే వాళ్లకు ఈ వ్యాపారం బెస్ట్ బిజినెస్ అవుతోంది. ఈ స్కీమ్ కోసం దరఖస్తు చేసుకున్న వాళ్లకు ప్రభుత్వం నుంచి గరిష్టంగా 2.75 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం లభించనుంది.