కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మరో తీపికబురు అందించింది. సామాన్య ప్రజలను కోటీశ్వరులుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ దిశగా అడుగులు వేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. షాపింగ్ చేసిన బిల్లును మొబైల్ యాప్ లో అప్ లోడ్ చేయడం ద్వారా సులువుగా 10 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు క్యాష్ ప్రైజ్ ను అందుకునే అవకాశం అయితే ఉంటుంది.
మేరా బిల్ మేరా అధికార్ పేరుతో ఈ స్కీమ్ అమలవుతుండటం గమనార్హం. జీఎస్‌టీ ఇన్వాయిస్ బిల్లును అప్ లోడ్ చేయడం ద్వారా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను సులభంగా పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లో ఈ యాప్ అందుబాటులో ఉండగా జీఎస్‌టీ ఐఎన్ నంబర్ కచ్చితంగా ఉన్న ఇన్వాయిస్ లను అప్ లోడ్ చేయడం ద్వారా మాత్రమే ఈ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది.
కనీసం 200 రూపాయల బిల్లు చేసిన 25 బిల్స్ ను అప్ లోడ్ చేసే అవకాశం ఉండగా 500 లక్కీ డ్రాలు తీసి వినియోగదారులకు క్యాష్ ఫ్రైజ్ ఇవ్వనున్నారు. త్వరలో ఈ యాప్ ను కేంద్ర ప్రభుత్వం లాంఛ్ చేయనుండటం గమనార్హం. మరోవైపు జీఎస్టీని ఎగవేస్తున్న వాళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆగష్టు నెల 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రావడం గమనార్హం.
కస్టమర్లు రివార్డ్ ఫ్రైజ్ కోసం అయినా ఇన్వాయిస్ బిల్ ను కచ్చితంగా తీసుకుంటారని కేంద్రం భావిస్తోంది. ఈ విధంగా చేయడం ద్వారా జీఎస్టీ ఎగవేతలకు చెక్ పెట్టవచ్చని కేంద్రం భావిస్తుండటం గమనార్హం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి.