దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టం అయిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైయస్ పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాని మొదట సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు వాయిదా నిర్ణయం తీసుకున్నారు. 2019 ఫిబ్రవరి 8న విడుదల అవుతుందని నిర్మాతలు వెల్లడించారు.
అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి కాకపోవటంతో ఫిబ్రవరికి వాయిదా వేసినట్టు చెబుతున్నారు. అయితే అసలు రీజన్ వేరే ఉందని అంటున్నారు. మొదట ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ అనుకున్నారు. కానీ ఇప్పటిదాకా రాలేదు . దాంతో సంక్రాంతికి ఫిక్స్ అయ్యారు.
అయితే అందరూ సంక్రాంతి టైమ్ లో ఎన్టీఆర్ బయోపిక్ మూడ్ లో ఉంటారని, ఆ టైమ్ లో ఈ సినిమా వేస్తే పెద్దగా ఉపయోగం ఏముంటుందని భావించారట. ఈ విషయమై వైయస్ జగన్ సైతం అనవసరమైన పోటీ వద్దని అన్నారని చెప్పుకుంటున్నారు. అందుకే రిలీజ్ డేట్ మార్చారని చెప్పుకుంటున్నారు.
జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2019 ఫిబ్రవరి 8న యాత్ర సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ మళయాల భాషల్లోనూ యాత్ర సినిమా రిలీజ్ అవుతోంది. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు.