దసరా బాక్సాఫీస్ : మూడు సినిమాలలో దసరా విన్నర్ ఏది..?

ఈ దసరా కానుకగా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మొత్తం మూడు సినిమాలు అయితే మన తెలుగు నుంచి పోటీ కి వచ్చాయి. మరి ఈ చిత్రాల్లో రెండు భారీ సినిమాలు అందులోని పెద్ద హీరోల సినిమాలు కాగా ఈ పండగకి సరైన సినిమా మాది కూడా అంటూ చిన్న సినిమా ఒకటి పెద్ద బ్యానర్ నుంచి వచ్చింది.

ఇక ఆ పెద్ద సినిమాలు అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన చిత్రం “గాడ్ ఫాదర్” కాగా రెండో చిత్రం అక్కినేని నాగార్జున నటించిన అవైటెడ్ ఏక్షన్ థ్రిల్లర్ చిత్రం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వచ్చిన చిత్రం “ది ఘోస్ట్”.

మరి ఈ రెండు సినిమాల మధ్యనే పెద్ద పోటీ నెలకొంటుంది అంటే వీటితో పాటుగా యంగ్ హీరో నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్ హీరోగా కొత్త దర్శకుడు కృష్ణ తెరకెక్కించిన “స్వాతిముత్యం” కూడా ఒకటి. మరి అనూహ్యంగా పోటీకి వచ్చిన ఈ మూడు చిత్రాల్లో దసరా విన్నర్ ఏది అనేది ఇప్పుడు ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిపోయింది.

ఈ పండగలో వచ్చిన ఈ మూడు చిత్రాలు అన్నీ కూడా పాజిటివ్ టాక్ నే సంతరించుకోవడం విశేషం. దీనితో మూడు చిత్రాలు కూడా ఈ దసరా కానుకగా వచ్చి విన్నెర్స్ గా నిలిచాయి. అయితే వసూళ్ల పరంగా అయితే ఆటోమేటిక్ గా గాడ్ ఫాదర్ ముందు ఉంటుంది. కానీ లాభాల విషయానికి వస్తే దేనికి ఎక్కువ వస్తాయో చూడాలి. మొత్తానికి అయితే ఈ దసరా మాత్రం టాలీవుడ్ లో గుర్తుండిపోతుంది.