షాకింగ్ : ‘సాహో’ ప్రి రిలీజ్ బిజినెస్

ప్రభాస్ సాహో చిత్రం ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ దగ్గర పడుతుండటంతో.. ప్రీ బిజినెస్ కూడ ఊపందుకుంది. దాదాపు ప్రి రిలీజ్ బిజినెస్ అన్ని ప్రాంతాలకు క్లోజ్ చేస్తున్నట్లు సమాచారం. ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ 255 కోట్ల దాకా జరుగుతుందని అంచనా వేసి లెక్కలు చెప్తున్నారు.

సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ (అంచనా)

తెలుగు రాష్ట్రాలు ఎపి/తెలంగాణా – 116 నుంచి 120 కోట్ల మధ్య (ఆంధ్రా నుంచి 80 – 85 కోట్లు, నైజాం నుంచి 35-40 ఎక్సపెక్ట్ చేస్తున్నారు. )

ఓవర్సీస్ – 43 కోట్ల దాకా

కర్ణాటక – 27 కోట్లు

నార్త్ ఇండియా – 50 కోట్లు

తమిళనాడు కేరళ – 21 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా సాహు ప్రీ రిలీజ్ బిజినెస్ – సుమారు 255 కోట్లు