రాజమౌళి దర్శకత్వంలో రూపొందే సినిమా అంటేనే ఓ రేంజిలో క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేస్తున్నారంటే ఇక చెప్పేదేముంది. ఫ్యాన్స్ కు పండగే. అంతేకాదు సోషల్ మీడియాలోనూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. బాహుబలి స్దాయిలో ఈ సినిమా క్రేజ్ క్రియేట్ చేస్తుందని అప్పుడే అంచనాలు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ కు భారీ పోటీ ఏర్పడింది.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్‌సీస్ బిజినెస్ పూర్తయ్యిందట. దుబాయ్‌కి చెందిన ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అన్నీ భాషలకు సంబంధించిన ఓవర్ సీస్ హక్కులను రూ.65 కోట్లకు చేజిక్కించుకున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. చైనా విడుదల హక్కుల మాత్రం ఆయనకు దక్కలేదట. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ రుపుకుంటోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమా కోసం చరణ్, తారక్ కొత్త లుక్‌లో సిద్ధమయ్యారు. ప్రముఖ బాలీవుడ్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు.