రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు బయ్యర్లు లేకపోవడం, ఆశించినత బిజినెస్ రాకపోడం వల్ల విడుదల తేదీని ప్రకటించడం లేదంటూ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సినిమాపై ఇప్పటికే చాలా హైప్ క్రియేట్ అయినా కేవలం ఓపినింగ్స్ మాత్రమే ఇలాంటి సినిమాలకు వస్తాయని, ఆ తర్వాత విషయం లేక చతికిల పడుతున్నాయని బయ్యర్లు ధైర్యం చేయటం లేదట.
దానికి తోడు వర్మ నాగార్జున తో చేసిన సినిమా “ఆఫీసర్” బయ్యర్లను ముంచేయటం ఆయన్ని ఇబ్బందిలో పడేస్తోంది. చాలామంది కోట్లలో నష్టపోవంటంతో మరోసారి అలాంటి ఫీట్ రిపీట్ కాదు కదా అనుకుంటున్నారు. దాంతో బయ్యర్లు ఏవో కొన్ని ఏరియాలు తప్ప రెండు రాష్ట్రాల్లో ఎక్కువ భాగం కొనడానికి ఎవరు ముందుకు రావడం లేదట.. ఇక వర్మ ఇది కాదు పద్దతి అని పన్నెండు కోట్లు అన్నది ఎనిమిది కోట్లుకు తగ్గించి …ఇచ్చేసారని తెలుస్తోంది. సినిమా ఫస్ట్ కాపీ చూసిన శివం సెల్యులాయిడ్ సంస్థ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా వరల్డ్ వైడ్ థియేటర్ హక్కులను కొనేశారు.
వారు ఇప్పుడు ఏరియావైజ్ బిజినెస్ చేస్తున్నారు. ఓవర్సీస్, కర్ణాటక, ఆంద్ర, నైజాం, సీడెడ్, తమిళనాడు ఇలా అన్ని ఏరియాల థియేటర్ హక్కులను తొమ్మిది కోట్ల వరకు ఇస్తున్నారని…టేబుల్ ప్రాఫిట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట. ఇక ఎంత తక్కువకి అమ్మినా నిర్మాతలు లాభమే అంటున్నారు. ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ లోనే సినిమాను పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ సినిమాను మార్చి 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.