వామ్మో… ‘సాహో’ ఫస్ట్ డే ఎక్సపెక్టేషన్ అంతా ?

వామ్మో… ‘సాహో’ ఫస్ట్ డే ఎక్సపెక్టేషన్ అంతా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ సాహో. అంతర్జాతీయ స్థాయి యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ పైనే అందరి దృష్టీ ఉంది.

విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్ది లెక్కలు , అంచనాలు పెరుగుతున్నాయి. మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ అయ్యింది కాబట్టి అంతే మొత్తంలో షేర్ రావాలి దానికి రెండింతలు మించి అంటే ఓ ఆరు వందల కోట్లు దాటితేనే సాహో కమర్షియల్ లెక్కల్లో సేఫ్ ప్రాజెక్ట్ అనిపించుకుంటుంది. ఈ సమయంలో కీ రోల్ పోషించేది ఫస్ట్ డే కలెక్షన్సే.

ట్రేడ్ లో వేస్తున్న లెక్కలు ప్రకారం.. సాహో మొదటి రోజు ఒక్క తెలుగు వెర్షన్ నుంచే 125 కోట్ల దాకా వసూళ్లు ఎక్సపెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక హిందీ వెర్షన్ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఎక్కువ థియోటర్స్ లో రిలీజవుతుంది కాబట్టి ఫైనల్ రన్ కి 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాలనే ఆలోచన ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ అంచనాలే అనే విషయం మర్చిపోకూడదు. అందరూ బాహుబలిని దృష్టిలో పెట్టుకుని ఈ లెక్కలు వేస్తున్నారు.

ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్‌ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్‌, చుంకీ పాండే, అరుణ్‌ విజయ్‌లు కీలక పాత్రల్లో నటించారు.