మొన్న శుక్రవారం ఎన్టీఆర్ బయోపిక్ లో రెండో భాగం మహానాయకుడు రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా మొదటి పార్ట్ దారినే చూసుకుంది. బాలయ్య కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ప్రపంచ వ్యాప్తంగా కేవలం 3.41 కోట్లు వసూలు చేసింది. ఇదిలా ఉంటే .. పులి మీద పుట్రలా ఈ సినిమాకు పైరసీ దెబ్బ తగిలింది.కలెక్షన్స్ కన్నా `మహానాయకుడు` పైరసీ ప్రింట్ డౌన్ లోడ్స్ ఎక్కువ అని తేల షాకిచ్చింది.
ఈ సినిమాని తమిళ్ రాకర్స్ ఒరిజినల్ హెచ్‌డి క్వాలిటీ ప్రింట్ తో మొదటి రోజే ఆన్ లైన్ లో అందుబాబులోకి తెచ్చేసారు. అయితే జనం పెద్దగా చూడ్డానికి ఇంట్రస్ట్ చూపలేదు కదా… డౌన్ లోడ్ చేసుకుని మరీ ఓపిగ్గా ఎవరు చూస్తారులే అనుకున్నారంతా.
అయితే రివర్స్ లో ఈ సినిమాని డౌన్ లోడ్స్ చేసుకుని చూసేందుకు జనం తెగ ఇంట్రస్ట్ చూపెడుతున్నారని ఆ డౌన్ లోడ్స్ ని చూస్తుంటే అర్దమవుతోంది. దీంతో ఇప్పటికే థియేటర్లలో ఆడుతున్నా ఎవరూ అటువైపు వెళ్లటం లేదు. డబ్బులు పెట్టుకుని సినిమా చూసేకన్నా హాయిగా డౌన్ లోడ్ చేసుకుని మన సిస్టం లేదా ల్యాప్ టాప్ లో చూస్తే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చేసారు. అసలే ప్లాఫ్ బాధలో ఉన్న టీమ్ …ఈ పైరసీ వ్యవహారంపై ఏ డెసిషన్ తీసుకునే వాతావరణం కనపడటం లేదు.
మరోవైపు ఎలాగో కొద్ది రోజుల్లో అమెజాన్ లో అందుబాటులోకి వచ్చేస్తుందన్న ఆలోచన సైతం థియేటర్లకు వెళ్లనివ్వని సన్నివేశం. ఓవరాల్ గా అన్ని కలిసి సినిమాని దెబ్బ కొట్టేస్తున్నాయి. అయితే పైరసీ చేసినా, అమెజాన్ లో వచ్చినా ఎఫ్ 2 సినిమా హాళ్లు కళకళ్లాడుతున్నాయని కౌంటర్ గా అనొచ్చు…అదీ పాయింటే కదా.