నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ఎన్టీఆర్ కథనాయకుడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి వారం రోజులైంది.. విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ వసూళ్లలో మాత్రం పూర్తి స్దాయిలో వెనుకబడింది.
ఈ వారంలో ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ 18.50 కోట్లు మాత్రమే కలెక్షన్స్ రాబట్టింది. కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ దాదాపు డబ్బై శాతం వరకూ నష్టపోతారని సమాచారం. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఏరియా వైజ్ చూస్తే..
నైజాం : 3.77
సీడెడ్ : 1.56
ఉత్తరాంధ్ర : 1.55
ఈస్ట్ గోదావరి : 0.82
వెస్ట్ గోదావరి : 1.05
గుంటూరు : 2.71
కృష్ణా : 1.31
నెల్లూరు: 0.77
మొత్తం తెలంగాణా మరియు ఆంధ్రా – Rs 13.54 Cr
భారత్ లో మిగిలిన ప్రాంతాలు: 1.07
యుస్ & ఓవర్ సీస్: 3.42
మొత్తం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (ప్రపంచవ్యాప్తంగా) షేర్: Rs 18.03 Cr
ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్ర, విబ్రి మీడియా సమర్పణలో సాయి కొర్రపాటి, విష్ణు వర్థన్ ఇందూరి, నందమూరి బాలకృష్ణ ఈ సినిమాను సంయుక్తంగా ఎన్‌బీకే ఫిల్మ్ బ్యానర్‌లో నిర్మించారు. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించగా.. శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, సావిత్రిగా నిత్యా మీనన్, హరిక్రిష్ణగా కళ్యాణ్ రామ్, నాగేశ్వరరావుగా సుమంత్, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి, ‘టైగర్’ హెచ్.ఎం.రెడ్డిగా కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి తదితర 60 మందికి పైగా తారాగణం తెరపై సందడి చేస్తున్నారు.
ఇదే సీజన్ లో రామ్ చరణ్ మూవీ వినయ విధేయ రామ, వెంకీ, వరుణ్ తేజ్ ల ఎఫ్ 2 కూడా రిలీజయ్యాయి.. ఇందులో వి వి ఆర్ మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయి. ఇక ఎఫ్ 2 హిట్ టాక్ తో దూసుకుపోతోంది… ఇక ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7వ తేదిన విడుదల కానుంది.