మొత్తానికి నందమూరి తారక రామారావు బయోపిక్ విషయంలో దర్శక,నిర్మాతలు టార్గెట్ రీచ్ అయ్యినట్లే కనపడుతోంది. గత కొన్ని రోజులుగా నడుస్తున్న బిజినెస్ వ్యవహారాలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారనే విషయం ట్రేడ్ వర్గాల్లో క్రేజ్ పెంచేసింది. దానికి తోడు వారు కోరుకున్నట్లే…రెండు సినిమాల రిలీజ్ డేట్లు కి కూడా గ్యాప్ ఇచ్చేశారు.
ఒక సినిమాకు రెండు టికెట్లు కొనిపించబోతున్నారనేది ఈ సినిమాకు బాగా ప్లస్సైంది.దాంతో తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాక ఓవర్ సీస్ లోనూ ఈ సినిమాకు ఓ రేంజిలో హైప్ వచ్చింది. సాధారణంగా బాలయ్య సినిమాలు ఓవర్ సీస్ లో అంత ఇంపాక్ట్ ఉండదు. పెద్దగా బిజినెస్ నడవదు.
అయితే దర్శక,నిర్మాతలు వేసిన తెలివైన ఎత్తుగడ వల్ల సినిమా ఆదాయం రెట్టింపు చేసుకునే అవకాశం కలిగిందని అర్దం చేసుకున్నారు. ఈ నేఫధ్యంలో రెండు భాగాలకు కలిపి యుస్ లో రిలీజ్ చేయటానికి యుఎస్ తెలుగు వారు 19.80 కోట్లకు బిజినెస్ డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం.
కథ ఒక్కటే అయినా… పూర్తి నిడివితో రెండు సినిమాలు చూస్తారు కాబట్టి ప్రేక్షకులు నష్టపోయేదేమీలేదు. మామూలుగా బాలకృష్ణ సినిమాలకు జరిగే బిజినెస్తో పోలిస్తే చాలా ఎక్కువకే హక్కులు అమ్మారు. ఈ రేట్లు చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. సినిమా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తారన్న సమాచారం తెలిసే బయ్యర్లు అంతేసి రేట్లు పెట్టారా?లేక సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి ఆ రేటు పెట్టారా అనేది ఆసక్తికరం.
అయితే ఇప్పుడు అందరూ ఆలోచిస్తోంది.. సినిమాకు ఉండే రిస్క్. ఈ క్రేజ్ ని అంచనాలను ఈ చిత్రం అందుకుంటే సమస్య లేదు. అలాంటిదేమీ లేకపోతే మాత్రం కేవలం ఓపినింగ్స్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఎలా ఉండబోతుంది..అది ఏ స్దాయి హిట్ అవుతుందనేదానిపై సెకండ్ పార్ట్ విజయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యిన రోజే ఇది రిస్కీ బిజినెస్ అవుతుందా లేదా అనేది తేలిపోతుంది.