కాస్త కష్టపడి ఉంటే ఇప్పుడీ పరిస్దితి వచ్చేది కాదు..
ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా తెలుగులో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘ఎవరు’తో పాటు శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన రణరంగం సినిమాలు రిలీజ్ అయ్యాయి. గత వారం రిలీజ్ అయిన మన్మధుడు 2, కథనం సినిమాలు డిజాస్టర్ కావటం, ఆగస్టు 15 శెలవు కూడా కావటంతో రెండు సినిమాలకు మంచి ఓపెనింగ్స్ ఉంటాయని అందరూ భావిస్తున్నారు.
కానీ చూస్తూంటే ఈ అవకాశాన్ని శర్వా మిస్ చేసుకున్నాడనిపిస్తోంది. ఎందుకంటే ప్రమోషన్ విషయంలో అడవి శేషు దూసుకుపోతున్నాడు. నిన్న రాత్రే సినిమాను సినీ ప్రముఖులకు, మీడియాకు ప్రదర్శించటం కూడా కలిసొచ్చింది. దాంతో ఇప్పుటికే రివ్యూలు వచ్చేసి సినిమాకు బజ్ క్రియేట్ చేస్తున్నాయి. చిన్న సినిమాకు ఇలాంటి బజ్ చాలా అవసరం.
అదే రణరంగం విషయంలో కనడపటం లేదు. శర్వా కూడా ప్రత్యేకంగా ప్రమోషన్ చేసినట్లు కనపడటం లేదు. సోషల్ మీడియాలోనూ రణరంగంకు సంబంధించి హడావిడి ఏమీ మొదలు కాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అదే ఎవరు విషయంలో రివర్స్ లో ఉంది. ఈ రోజుని చూలా మంది ఎవరు సినిమా చూడటం కోసం ప్లాన్ చేసుకున్నారు. రణరంగం టీమ్ కూడా కొద్ది గా కష్టపడి ప్రమోట్ చేసి ఉంటే ఓపినింగ్స్ బాగుండేవి అనేది నిజం.