పాపం నీహారిక, వర్మ దెబ్బకు బలవ్వదు కదా

మెగా డాటర్‌ నిహారిక తాజా చిత్రం ‘సూర్యకాంతం’ప్రోమో, ట్రైలర్ చూసి అంతా ఆమెకు టైమ్‌ వచ్చినట్లే ఉందనుకున్నారు. బుల్లితెర మీద రాణిలా రాణించిన నిహారిక.. వెండితెరపై ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఒక మనసు, హ్యాపి వెడ్డింగ్‌ చిత్రాలతో మన ముందుకు వచ్చినా .. వాటిలో ఏవీ ఆశించినంత సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయింది. దాంతో ఈ సారి ‘సూర్యకాంతం’మీదే పూర్తి హోప్స్ పెట్టుకుంది. ఈ శుక్రవారం రిలీజ్ పెట్టుకున్నారు. అయితే ఎక్కడా ఈ సినిమాపై కొంచెం కూడా బజ్ క్రియేట్ కాకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

అప్పటికి దిల్ రాజు ఈ సినిమా రైట్స్ తీసుకుని రిలీజ్ చేస్తున్నారు. అయితే పట్టించుకునే వాళ్లే కరువు అయ్యారు. ఇక సోషల్ మీడియాలో ఈ చిత్రం టీమ్ తెగ ప్రమోట్ చేస్తోంది. ఆ ఇంపాక్ట్ కనిపించటం లేదు. ఎలక్షన్స్ వేడిలో అవన్నీ ఆవిరి అయ్యిపోతున్నాయి. ప్రి రిలీజ్ పంక్షన్ కు విజయ్ దేవరకొండ వచ్చినా కొంచెం కూడా బజ్ లేదు.

అందరి దృష్టీ వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ పైనే ఉంది. ఆ సినిమా ముందు సూర్యాకాంతం ఆనటం లేదు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక ..టాక్ బాగుంటే నిలబడుతుందనటంలో సందేహం ఏ మాత్రం లేదు.

‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘ఇద్దరు అమ్మాయిల మధ్యలో స్ట్రగుల్‌ అయ్యే పాత్రలో రాహుల్‌ విజయ్‌ నటన నన్ను ఆకట్టుకుంది. రాహుల్‌లో ఆ టాలెంట్‌ ఉంది కాబట్టి నేను ఎంకరేజ్‌ చేస్తున్నా. నా లైఫ్‌లోనే కాదు, ఎవరి లైఫ్‌లోనూ సూర్యకాంతం ఉండకూడదు’’ అన్నారు.

సక్సెస్‌ఫుల్‌ వెబ్‌ సిరీస్‌ ‘ముద్దపప్పు ఆవకాయ’ డైరెక్టర్‌ ప్రణీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫైట్‌ మాస్టర్‌ విజయ్ తనయుడు రాహుల్‌విజయ్‌ హీరోగా నటిస్తున్నారు. నిహారికది విభిన్న పాత్రలో అని చెప్తున్నారు