నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఎర్నేని నవీన్, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన చిత్రం ‘సవ్యసాచి’.ఈ చిత్రం నిన్న శుక్రవారం రోజు అంతటా భారీ ఎత్తున విడుదలైంది. అయితే మార్నింగ్ షోకే ఈ సినిమాకు కష్టం అనే టాక్ వచ్చేసింది. ఈ చిత్రంలో విలన్ గా చేసిన మాధవన్ చిత్రం ప్రమోషన్స్ లో ఎక్కడా కనపడలేదు. దాంతో ఈ చిత్రం రిజల్ట్ ని మాధవన్ ముందే అంచనా వేసాడా, అందుకే ప్రమోషన్స్ కు దూరంగా ఉండిపోయాడా అనే సందేహాలు ఇప్పుడు తెలుగు పరిశ్రమలో అందరికీ కలుగుతున్నాయి.
సాధారణంగా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే కీ ఆర్టిస్ట్ లు దాని రిజల్ట్ ఏమిటనేది దాదాపు గా అంచనా వేసేస్తూంటారు. చాలా వరకూ వారి అంచనాలు తప్పవు. అయితే ఎక్కడా నెగిటివ్ గా కామెంట్స్ చేయకుండా సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూంటారు. అలాంటిదే మాధవన్ చేసాడని చెప్పుకుంటున్నారు. అయితే నాగచైతన్య మాత్రం ఈ సినిమాపై మంచి అంచనాలే పెట్టుకున్నాడని అంటున్నారు. సినిమా రిలీజ్ అయ్యి రిజల్ట్ వచ్చేదాకా ఆయన అదే నమ్ముతూ ఉండిపోయారని తెలుస్తోంది.
‘కార్తికేయ’తో మంచి కథకుడిగా గుర్తింపు పొందిన చందు మొండేటి ‘ప్రేమమ్’ తర్వాత… మళ్లీ తనకి ఇష్టమైన కథతో ‘సవ్యసాచి’ చేయటమే చైతూ నమ్మకానికి కారణమైంది. గర్భంలోనే ఇద్దరు కవలలు ఒకరిగా కలిసిపోతే ఏమవుతుందనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. మాధవన్ ఇందులో కీలక పాత్ర పోషించడంతో సినిమాపై ఆసక్తి, అంచనాలు పెరిగాయి. రావు రమేశ్, వెన్నెల కిశోర్, సత్య, తాగుబోతు రమేశ్ తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరా: యువరాజ్.