Madhavan: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరో మాధవన్ ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. తమిళ హీరోగా మొదలైన ఆయన సినీ ప్రయాణం పాన్ ఇండియా రేంజ్ వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి లవర్ బాయ్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా అమ్మాయిల కలల రాకుమారుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.
హిందీలో మాధవన్ జోరు మామూలుగా లేదు ఇప్పుడు. ఆయన కోసమే కథ రాస్తున్న దర్శకులు కూడా ఉన్నారు. మొన్న కేసరి 2లో అద్భుతమైన పాత్ర చేసిన మాధవన్ తాజాగా ధురంధర్ సినిమాలో నటిస్తున్నారు. తెలుగు తమిళం అని తేడా లేకుండా అన్నిచోట్లా రప్ఫాడిస్తున్నారు మాధవన్. ముఖ్యంగా హిందీలో మాధవన్ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. ఏడాదికి అరడజన్ సినిమాలకు పైగానే నటిస్తున్నారు. ఈ మధ్యే ఆప్ జైసే హో సినిమాతో వచ్చిన మాధవన్ ప్రస్తుతం దేదే ప్యార్ దే 2తో పాటు ధురందర్ సినిమా చేస్తున్నారు.
ఇలా 50 ఏళ్ళ వయసు దాటినా కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. డిఫెరెంట్ క్యారెక్టర్స్‌తో దూసుకుపోతున్నారు మాధవన్. తాజాగా ఈయనకు తెలుగు నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో వస్తున్న SSMB29లో హీరో తండ్రి పాత్రకు మాధవన్ ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అన్ని ఇండస్ట్రీల్లోనూ మ్యాడీ జోరు నెక్ట్స్ లెవల్ లో ఉంది ఇప్పుడు.
