బాక్సాఫీస్ రిపోర్ట్ : వరల్డ్ వైడ్ “గాడ్ ఫాదర్” ఫస్ట్ డే వసూళ్ల డీటెయిల్స్ ఇవే.!

నిన్న దసరా కానుకగా టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చినటువంటి తాజా చిత్రాల్లో ఓ సెన్సేషన్ల మెగా మల్టీ స్టారర్ చిత్రం గాడ్ ఫాదర్ కూడా ఒకటి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అలాగే బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ లు హీరోలుగా నటించిన ఈ చిత్రం దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించారు.

మరి మంచి అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం వసూళ్ల పరంగా పర్వాలేదనిపించే రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. అయితే ఎంత లేదన్నా ఆచార్య ఎఫెక్ట్ కొద్దిగా పడింది. దీనితో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి కేవలం 13 కోట్ల షేర్ మాత్రమే వసూలు కాగా..

వరల్డ్ వైడ్ అయితే గాడ్ ఫాదర్ మొదటి రోజు 18 కోట్ల మేర షేర్ వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా హిందీ వసూళ్ల రిపోర్ట్స్ అయితే ఇంకా రావాల్సి ఉన్నాయి. ఆల్రెడీ ఓవర్సీస్ లో మరింత బెటర్ గా ఈ చిత్రం నిలిచినట్టు తెలుస్తుంది.

దీనితో వారాంతానికి లేదా ఫైనల్ రన్ లో బెటర్ వసూళ్ల దగ్గరే ఈ సినిమా ఆగుతుంది అని అంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటించగా సత్యదేవ్, సునీల్ తదితరులు ఇంట్రెస్టింగ్ పాత్రలు చేశారు.