బాక్సాఫీస్ రిపోర్ట్ : వరల్డ్ వైడ్ “బ్రహ్మాస్త్ర” డే 1 వసూళ్లు ఎలా వచ్చాయంటే.!

ఈ ఏడాది పాన్ ఇండియా సినిమా దగ్గర ఎన్నో అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి వచ్చిన భారీ చిత్రం “బ్రహ్మాస్త్ర”. బాలీవుడ్ నుంచి వచ్చిన మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ కూడా ఇదే. అయితే ఈ చిత్రం లో రణబీర్ కపూర్, ఆలియా భట్ లు నటించగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అలాగే మన తెలుగు నుంచి అక్కినేని నాగార్జున లు కీలక పాత్రల్లో నటించారు.

అయితే ఈ సినిమా పై చాలా నెగిటివిటి వచ్చినా కూడా సినిమా ఓపెనింగ్స్ నాటికీ మాత్రం అదిరే లెవెల్లో అంతా సెట్టయ్యిపోయింది. మరి ఈ అవైటెడ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మొదటి రోజు ఎంత వసూలు చేసింది అనేది తెలుస్తుంది.

చిత్ర మేకర్స్ అయితే భారీ మొత్తంలో 75కోట్లు ఈ సినిమా  చేశారు. కానీ అసలైన నంబర్స్ అయితే వేరేలా ఉండొచ్చని అంటున్నారు. ఇండియాలో అయితే సుమారు 45 కోట్లు నెట్ వసూళ్లు అలాగే ఓవర్సీస్ లో 25 కోట్ల మేర వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.

మొత్తానికి అయితే మొదటి రోజు ఈ సినిమాకి అంచనాలకి తగ్గ ఓపెనింగ్స్ నే నమోదు అయ్యాయని చెప్పాలి. ఇక ఈ వారాంతానికి ఎంత వస్తాయో చూడాలి. అలాగే ఫైనల్ రన్ లో కూడా ఎంత వస్తాయి అనేది ఆసక్తిగా మారింది.