బాక్సాఫీస్ : ‘గాడ్ ఫాదర్’ హిందీ, వరల్డ్ వైడ్ వసూళ్లపై లేటెస్ట్ సమాచారం.!

టాలీవుడ్ సహా బాలీవుడ్ మెగా మల్టీ స్టారర్ అయినటువంటి గాడ్ ఫాదర్ చిత్రం నిన్న దసరా కానుకగా రిలీజ్ అయ్యి మొదటి ఆట తోనే అదిరే టాక్ ని అయితే అటు హిందీ సహా తెలుగులో కూడా రాబట్టుకుంది. దీనితో మరీ అంత భారీ స్థాయి వసూళ్లు కాకపోయినా మంచి ఓపెనింగ్స్ నే ఇప్పుడు చిత్రం రాబట్టింది.

అయితే వరల్డ్ వైడ్ మరీ అంతా భారీ నంబర్స్ నమోదు చెయ్యలేదు కానీ 18 కోట్ల మేర షేర్ ఈ చిత్రం అందుకుంది ట్రేడ్ పండితులు తెలిపారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా హిందీ వసూళ్లపై ముందు అప్డేట్ రాలేదు కానీ ఇప్పుడు అయితే దీనిపై సమాచారం తెలిసింది.

అలాగే వరల్డ్ వైడ్ వసూళ్లపై కూడా మేకర్స్ అయితే క్లారిటీ ఇచ్చారు. ఇక హిందీ వసూళ్ల పరంగా చూస్తే ఈ చిత్రం అక్కడ 2.25 కోట్ల నెట్ వసూళ్లు అయితే అందుకుంది. దీనితో ఈ చిత్రం వరల్డ్ వైడ్ మొదటి రోజు కి గాను 38 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టు చిత్ర యూనిట్ కూడా అధికారికంగా అనౌన్స్ చేశారు.

మొత్తానికి అయితే గాడ్ ఫాదర్ కి ఓ రకంగా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. హిందీలో కూడా ఈ వసూళ్లు బెటర్ అయ్యే ఛాన్స్ లు కూడా ఉన్నాయి మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఇంకా ఈ సినిమాకి దర్శకుడు మోహన్ రాజా తమిళ్ లో దృవ ఒరిజినల్ సినిమా ఫేమ్ వర్క్ అందించగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించారు.