బాక్సాఫీస్ రిపోర్ట్ : ఆగని “బింబిసార” క్రేజ్..ఐదో రోజు కూడా మంచి నంబర్స్.!

Bimbisara Movie Review

ఈ ఏడాది టాలీవుడ్ లో తగిలిన ఎన్నో హిట్ సినిమాలు అన్నీ కూడా భారీ హిట్స్ అనే చెప్పాలి. అయితే బాక్సాఫీస్ దగ్గర అన్నీ కూడా మంచి లాభాలు అందించి పెట్టాయి లేదా అంతే రేంజ్ లో భారీ డిజాస్టర్స్ అయిపోయాయి. ఇక దీనితో అయితే ఈ గడ్డు కాలం బాగా దారుణంగా మారేసరికి ఈ ఓ హిట్ కావాల్సి వచ్చింది.

మరి ఈ సమయంలో వచ్చిన చిత్రమే “బింబిసార”. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా దర్శకుడు వసిష్ఠ కాంబో లో వచ్చిన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు వీక్ డేస్ లోకి వచ్చి కూడా మంచి వసూళ్లతో అదరగొడుతున్నట్టుగా ట్రేడ్ వర్గాల వారు తెలియజేస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా అయితే ఐదవ రోజు వసూళ్లు డీటెయిల్స్ తెలుస్తున్నాయి. ఏపీ తెలంగాణాలో ఈ చిత్రం ఐదవరోజు గాను 2.52 కోట్ల షేర్ వసూలు అయ్యిందట. దీనితో ఈ చిత్రం ఈ ఐదు రోజుల్లో ఏకంగా 20 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.

మొత్తానికి అయితే ఈ సినిమా అదిరే నంబర్స్ ని నమోదు చేస్తుందని చెప్పి తీరాలి. ఇంకా ఈ సినిమాలో అయితే క్యాథరిన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించగా కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మాణం అందించాడు.