రెండేళ్ల కష్టమే ..మా ‘డెవిల్‌’ : హీరో నందమూరి కళ్యాణ్‌ రామ్‌

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘డెవిల్‌’. ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ అనేది ట్యాగ్‌లైన్‌. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా దర్శకనిర్మాతగా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబర్‌ 29న ప్రపంచ వ్యాప్తంగా సినిమా భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా మంచి స్పందననే రాబట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్‌ హైదరాబాద్‌లో చిత్ర సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేసుకున్నారు.

ఈ సందర్భంగా జరిగిన విూడియా సమావేశంలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ ‘మా డెవిల్‌’ సినిమాను పెద్ద సక్సెస్‌ చేసిన నందమూరి అభిమానులు, తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరికీ రుణపడి ఉంటాను. సినిమా సక్సెస్‌ అయితే ఇండస్టీ అంతా బావుంటుంది. కాబట్టి సినిమా సక్సెస్‌లో భాగమైన అందరికీ థాంక్స్‌. రెండేళ్ల కష్టమే మా ‘డెవిల్‌’ చిత్రం. 1940 బ్యాక్‌డ్రాప్‌ చేయటం అంత సులభం కాదు. శ్రీకాంత్‌ ఏడాది పాటు కథతో ట్రావెల్‌ అయ్యారు. ఈ సినిమా స్టార్ట్‌ చేసిన కొన్ని రోజులకు సౌందర్‌ రాజన్‌గారికి గుండె ఆపరేషన్‌ జరిగింది. డాక్టర్స్‌ మూడు నాలుగు నెలలు రెస్ట్‌ అవసరం అని చెప్పినా ప్దదెనిమిది రోజుల్లోనే సెట్స్‌లోకి అడుగు పెట్టేశారు.

ఇది సినిమాపై ఆయనకున్న ప్రేమను తెలియజేస్తుంది. మా ప్రొడ్యూసర్‌ మరియు డైరెక్టర్‌ అయిన అభిషేక్‌ నామా.. బ్జడెట్‌ విషయంలో కాంప్రమైజ్‌ కాకుండా ఖర్చు పెట్టి మంచి ప్రొడక్షన్‌ వేల్యూస్‌తో అద్భుతంగా డైరెక్ట్‌ చేశారు. వాసుగారు, మొహిత్‌, నవీన్‌ అందరూ మిగతా ప్రొడక్షన్‌ వ్యవహారాలను చక్కగా డీల్‌ చేశారు. టీమ్‌ అంతా ఎంతో కష్టపడ్డాం. ‘బింబిసార’ రేంజ్‌ డైలాగ్స్‌ వస్తాయా అని అనుకున్నాను. కానీ ‘డెవిల్‌’ సినిమా డైలాగ్స్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ ఇచ్చారు. కథ, స్క్రీన్‌ప్లేను అందరూ అభినందిస్తున్నారు.

మా ఆర్ట్‌ డైరెక్టర్‌ గాంధీగారు ఎక్సలెంట్‌ సెట్‌ వేశారు. నా సినిమాల్లో ‘డెవిల్‌’ బెస్ట్‌ సెట్స్‌తో చేశాం. వెంకట్‌ మాస్టర్‌ యాక్షన్‌ సీక్వెన్సులను అద్భుతంగా చేశారు. ఎడిటర్‌ తమ్మిరాజుగారితో ‘పటాస్‌’ నుంచి మంచి అనుబంధం ఉంది. ఇప్పటికీ అదే అనుబంధం కొనసాగుతోంది. మా కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రాజేష్‌ చాలా రీసెర్చ్‌ చేసి సినిమాలో కొత్త ఫీల్‌ను తీసుకొచ్చారు. కాస్ట్యూమ్స్‌ను ఇటలీ నుంచి తీసుకొచ్చారు. ప్రతీ సీన్‌ కొత్తగా అనిపించింది. ఇక నటీనటుల విషయానికి వస్తే షఫీగారు చాలా ముఖ్యమైన పాత్రలో నటించారు.

ఇంకా సంయుక్తా విూనన్‌, మాళవికా నాయర్‌ సహా అందరికీ థాంక్స్‌. హర్షవర్ధన్‌ సంగీతం ఎలా ఇస్తారోనని అనుకున్నాను. ఎందుకంటే ఈ సినిమాకు బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ మెయిన్‌ పిల్లర్‌ హర్ష ఎలా ఇస్తాడోనని అనుకున్నాను. అయితే దర్శక నిర్మాత అభిషేక్‌ గారు నమ్మకంతో ముందుకెళ్దామని నాకు చెప్పారు. యానిమల్‌తోనూ తను మరో సక్సెస్‌ కొట్టారు.. తనకు థాంక్స్‌. శ్రీకాంత్‌ విస్సా చాలా మంచి కథను అందించారు. త్వరలో ’డెవిల్‌ 2’ కూడా ఉంటుంది. కారైకుడిలో ’డెవిల్‌’ షూట్‌ చేస్తున్నప్పుడు శ్రీకాంత్‌ ’డెవిల్‌ 2’ ఐడియా చెప్పారు. నాకు బాగా నచ్చిందని అన్నారు.