ఎన్టీఆర్ బయోపిక్ లో రెండవ భాగమైన ‘మహానాయకుడు’ సినిమాను ఈ నెల 22వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం .. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు .. అనుకున్నది సాధించేవరకూ ఆయన సాగించిన పోరాటం .. మహానాయకుడిగా ఎదిగిన తీరును ఈ భాగంలో చూపించనున్నారు. నందమూరి అభిమానులను ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో కానీ ప్రస్తుతానికి అయితే ఈ సినిమా కు బికినీ పోటు తగలనుంది.
మహానాయకుడు సినిమా రిలీజ్ రోజే రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి నటించిన మిఠాయి రిలీజ్ అవుతోంది. అలాగే 4 లెటర్స్ అనే చిత్రం కూడా రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాల్లోనూ బికినీ ట్రీట్ ఉండనుంది. ఇప్పటికే ఈ సినిమాల్లో నటించిన హీరోయిన్స్ బికినీ అందాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూత్ ని ఎట్రాక్ట్ చేసే భాగంగా ఆ సినిమా టీమ్ లు బికినీ పై భారం వేసాయి. ఖచ్చితంగా మహానాయకుడుకు ఇవి పోటీ ఇస్తాయనటంలో సందేహం లేదంటున్నారు ట్రేడ్ వర్గాల జనం.
మరో ప్రక్క ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే విమర్శలకు తావిచ్చింది. కేవలం ఓ భజన వీడియోగా దాన్ని సోషల్ మీడియాలో కామెడీ చేస్తున్నారు. ఫస్ట్ పార్టులోనే తీవ్రమైన భజన చేశారనుకుంటే.. రెండో పార్టులో అంతకు మించి భజన కనిపిస్తూ ఉండటం విశేషం.
అందులోనూ నాటి ప్రధాని ఇందిర ఎన్టీఆర్ కటౌట్ ను చూసి కృష్ణుడిగా భావించి నమస్కారం పెట్టుకున్నట్టుగా చూపించిన సీన్ మరింత విమర్శల పాలవుతోంది. ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో రాణించిన మాట వాస్తవమే కానీ..ఇలా ఇందిరాగాంధీ గురించి ఒక కల్పితన సన్నివేశాన్ని పెట్టడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.