‘రాక్షసుడు’..భలే టైమ్ చూసుకు వస్తున్నాడు

‘రాక్షసుడు’..భలే టైమ్ చూసుకు వస్తున్నాడు

సినిమా ఎంత బాగా తీసినా రిలీజ్ డేట్ సరైంది లేకపోతే హిట్ రావటం కష్టం. ఆ విషయం నిర్మాతలకు బాగా తెలుసు. ముఖ్యంగా బెల్లంకొండ సురేష్ వంటి సీనియర్ నిర్మాతలకు ఇంకా బాగా తెలుసు. అందుకే ఆయన తన కుమారుడు తాజా చిత్రానికి అన్ని జాగ్రత్తలు తీసుకుని రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు.

‘రైడ్, వీర’ చిత్రాల దర్శకుడు రమేష్‌ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. ఎ. హవీష్‌ లక్ష్మణ్‌ కోనేరు ప్రొడక్షన్‌ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 2న విడుదల చేస్తున్నారు. ఆ వారంలో ఏవో బాగా చిన్న సినిమాలు తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రిలీజ్ లేదు. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమా విషయమై ఉత్సాహంగా ఉన్నారు.

రీసెంట్ గా ‘సీత’ తో పలకరించిన బెల్లంకొండ శ్రీనివాస్ హిట్ కోసం డెస్పరేట్ గా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్ట్రైయిట్ కథ కన్నా ఆల్రెడీ ప్రూవ్ అయిన రీమేక్ అయితే కొంతలో కొంత సేఫ్ అని తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రాచ్చసన్’ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’తో పేరుతో రీమేక్ చేసాడు. రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బెల్లంకొండ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది.

ఈ సందర్భంగా హవీష్‌ కోనేరు మాట్లాడుతూ–‘‘తమిళంలో హిట్‌ అయిన ‘రాక్షసన్‌’ చిత్రాన్ని ‘రాక్షసుడు’ పేరుతో రీమేక్‌ చేశాం. ఇదొక క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌. బెల్లంకొండ శ్రీనివాస్‌ సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ తమ్ముడు సాగర్‌ ఈ చిత్రంతో మాటల రచయితగా పరిచయం అవుతున్నారు’’ అన్నారు.

‘కవచం’ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించే ఈ సినిమాతోనైనా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సక్సెస్ అవుతాడేమో చూడాలి. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ సి.దిలీప్, సంగీతం: జిబ్రాన్‌.