సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’. ఈ చిత్రం నిన్న( బుధవారం) విడుదలై మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 1100 పైగా స్క్రీన్స్‌పై భారీగా విడుదలైన ఈ చిత్రానికి బెనిఫిట్ షోలు,ప్రీమియర్ షోలతో కనకవర్షం మొదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ఏ స్దాయికి వెళ్లిపోతుందో అనుకున్నారు. అయితే అంచనాలు తారుమారు అయ్యాయి.
రివ్యూలన్నీ అద్బతమని అన్నా…భాక్సాఫీస్ వద్ద ఆ పరిస్దితి కనపడటం లేదు. మార్నింగ్ షోకు ఉన్న కలెక్షన్స్, క్రౌడ్ సాయింత్రానికి కనపడం లేదు. చాలా చోట్ల కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయని ట్రేడ్ టాక్. అందుకు కారణం ..కేవలం డాక్యుమెంటరీగానే కథ,కథనం నడవటం అంటున్నారు. మహానటిలా ఓ డ్రామా ఈ సినిమాలో కనపడకపోవటంతో సినిమా పెద్దగా మాస్ లోకి వెళ్లలేకపోయింది.
ఇక యుఎస్‌లో 600పైగా స్క్రీన్స్‌పై ఈ చిత్రాన్ని ప్రదర్శించగా.. బాలయ్య కెరియర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ రికార్డులకెక్కింది. ప్రీమియర్స్ ద్వారా 5,19,000 డాలర్ల (దాదాపు మూడున్నర కోట్ల రూపాయలకు పైగానే) కలెక్షన్లను కొల్లగొట్టింది. ఓవర్సీస్‌లో పెద్దగా మార్కెట్‌లేని బాలయ్య.. ఇది ఎంతవరకూ నిలబెట్టుకుంటారో చూడాలి.