`ఎన్టీఆర్ – మహానాయకుడు` టాక్,అదే మైనస్

బాలకృష్ణ ప్రధాన పాత్ర లో నటించిన `ఎన్టీఆర్ – మహానాయకుడు` ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్నే హైద‌రాబాద్ ఏఎంబీ సినిమాస్ లో మీడియాకు ప్రివ్యూని వేశారు. అక్కడ చూసిన వారి రిపోర్ట్ ఏమిటంటే… మ‌హానాయ‌కుడు ఫ‌స్టాఫ్ డీసెంట్ గా బాగుంది.కానీ సెకండాఫ్ లో ఏమి జరిగనట్లు లేదు.

ఫస్టా ఫ్లో తెలుగు దేశం పార్టీ రాజ‌కీయగా ఎదగటం, సంచ‌ల‌న విజ‌యం సాధించటం వంటివన్నీ ఒకే ర‌క‌మైన టెంపోలో చూపించ‌డంలో క్రిష్ స‌క్సెస‌య్యారు.ఇంట‌ర్వెల్ కి ముందు నాదెండ్ల భాస్క‌ర‌రావ్ వెన్నుపోటు ట్విస్టు బాగుంది. అయితే సెంకండాఫ్ లో ఆ ట్విస్ట్ ని ఎదుర్కొనేందుకు ఎన్టీఆర్ చేసిన సాహసాల కన్నా చంద్రబాబు చేసిన ప్రయత్నాలే హైలెట్ గా కనపడతాయి. అది కావాలని ఈ కాలానికి తగినట్లు చేసిన స్క్రీన్ ప్లే అని అర్దమైపోయింది. పార్టీ ప్రచారం కోసం ఈ చిత్రం చేసారని తెలుస్తోంది. దాంతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.

ఈ సినిమా నంద‌మూరి ఫ్యాన్స్ కు, తెలుగు దేసం పార్టీ అభిమానులకు ఇదో విజువ‌ల్ ఫీస్ట్ లా కనిపించవచ్చు . అయితే ఎన్టీఆర్ ముఖ్య మంత్రి అయ్యాక సినిమా పేస్ డ్రాప్ అవటం మొదలెట్టి సమాన్య ప్రేక్షకులకు కాస్త ఇబ్బందినే పెట్టింది. ఎన్టీఆర్ చుట్టూ సెంటిమెంట్ సీన్స్ అల్లి అల్లారు కానీ హీరోయిజానికి అవకాసం ఇవ్వలేదు. చంద్ర‌బాబు నాయుడు పాత్ర ఎంట్రీ నుంచి కథ టర్న్ తీసుకుని, ఆ పాత్ర చుట్టూ పరుగెట్టింది. ఆ పాత్ర‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న‌దే సినిమా విజయానికి కీలకం కానుంది.

అయితే తొలి భాగం కంటే ఈ సినిమా చాలా బెస్ట్. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఉన్న ట్విస్టులు, టర్నులు, ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్, నాదెండ్ల వెన్నుపోటు వంటి కోణాలు ఆసక్తి ని రేకెత్తించాయి.