వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’. వరుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని … ఘాజీతో జాతీయ అవార్డ్ అందుకున్న సంకల్ప్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. మొన్న శుక్రవారం రిలీజైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. వీకెండ్ కలెక్షన్స్ చాలా చోట్ల బాగానే ఉన్నాయి. అయితే అనుకున్న స్దాయిలో లేవు.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం…మొత్తం ఈ వీకెండ్ లో వరల్డ్ వైడ్ షేర్ 4.40 కోట్లు రాబట్టింది. సంక్రాంతి వరకు పెద్హ సినిమాలు లేకపోవడంతో మంచి కలెక్షన్స్ ని రాబట్టే అవకాశాలు ఈ సినిమాకు కనిపిస్తున్నాయి. ఈ వీకెండ్ కి ఈ చిత్రానికి సంబందించిన కలెక్షన్స్ ఈ క్రింద విధంగా ఉన్నాయి
నైజాం : 1.48 కోట్లు
సీడెడ్: 39 లక్షలు
కృష్ణ: 22 లక్షలు
గుంటూరు : 30 లక్షలు
నెల్లూరు : 11 లక్షలు
వెస్ట్: 13 లక్షలు
ఈస్ట్ : 18 లక్షలు
ఉత్తరాంధ్ర: 0.36 లక్షలు
మొత్తం 3రోజుల ఆంధ్రప్రదేశ్/తెలంగాణా షేర్ : 3.17 కోట్లు
కర్ణాటక & ROI : 30 లక్షలు
ఓవర్సీస్ : 0.95 కోట్లు
మొత్తం మొదటి వీకెండ్ ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ : 10Crs
ఇక జీరో గ్రావిటీలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్పేస్ సెటప్‌లో ఈ అంతరిక్షం సినిమాను చిత్రీకరించారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈ చిత్రం కోసం అత్యున్నత సాంకేతిక విభాగం పని చేశారు. హాలీవుడ్ యాక్షన్ నిపుణుల పర్యవేక్షణలో అంతరిక్షం చిత్రానికి యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలిచాయి. అయితే ఎన్ని ఉన్నా..సినిమాలో సరైన కథ,కథనం లేకపోవటంతో జనాలకు పెద్దగా కనెక్ట్ కాలేదు.
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, సాయిబాబు జాగర్లమూడి, వై రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. జ్ఞానశేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. ప్రశాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు.