హమ్మయ్య – పవన్ ఈ సినిమా ఆగిపోలేదు.. 

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు చేస్తున్న చిత్రాల్లో అయితే ఆల్రెడీ ఎన్నో ఏళ్ల కితం నుంచి ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఆ చిత్రాల్లో ఇప్పుడు ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ అలానే హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి.

అయితే ఈ అన్నిటిలో కూడా పవన్ నుంచి మొట్ట మొదటిగా అనౌన్స్ చేసిన మొదటి పాన్ ఇండియా సినిమానే “హరిహర వీరమల్లు”. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్ మొదటిసారిగా ఓ యోధుడి పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాపై ఒకప్పుడు ఉన్న అంచనాలే వేరు.

అయితే ఇప్పుడు మారిపోయిన పరిస్థితుల్లో అసలు ఈ సినిమా ఉందా లేదా అనేది పెద్ద డౌట్ గా మారిపోయింది. పైగా పవన్ ఈ సినిమాకి తప్ప మిగతా రెండు సినిమాలకి డేట్స్ ఇవ్వడంతో మరింత టెన్షన్ మొదలైంది. కాగా దీనితో ఆల్ మోస్ట్ ఈ సినిమా పక్కకి పోయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు దీనిపై హమ్మయ్య అనే రేంజ్ క్లారిటీ అయితే వచ్చేసింది.

చిత్ర యూనిట్ నుంచి దర్శకుడు క్రిష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్ ని సినిమా టైటిల్ తో అందించారు. దీనితో ఈ సినిమా ఆగిపోలేదు ఆన్ లోనే ఉంది అనేది మాత్రం అందరికీ ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఇక సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మాత్రం ఆ శివయ్యకే తెలియాలి. ఇంకా ఈ సినిమాలో పవన్ సరసన యంగ్ నటి నిధి అగర్వాల్ నటించగా ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు. 
dhttps://x.com/HHVMFilm/status/1722954067960541687?s=20