అమెజాన్ ప్రైమ్ లో స్టీమింగ్ వచ్చాక చాలా సినిమాలకు కలెక్షన్స్ నామ మాత్రంగా కూడా ఉండటం లేదు. ఎలాగో ఓ రెండు రోజులు పోతే …హెచ్ డి క్వాలిటీ తో చూసేస్తున్నాం కదా అని ఆలోచనతో జనం యావరేజ్ సినిమాల వైపు చూడటం లేదు. ఇక పోతే ఇప్పుడు డబ్బింగ్ సినిమా విశ్వాసం ..అమెజాన్ మరో విధంగా దెబ్బ కొట్టింది.
ఈ సినిమా ఈ శుక్రవారం తెలుగులో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అవుతోంది. అయితే రెండు రోజుల క్రితమే ఈ సినిమా తమిళ వెర్షన్ సినిమాను లైవ్ స్ట్రీమ్ ఇచ్చేసింది అమెజాన్. దాంతో ఆల్రెడీ హెచ్ డి క్వాలిటీలో అఫీషియల్ గా దొరుకుతున్న సినిమాని పనిగట్టుకుని ధియోటర్ కు వచ్చి చూసేవారు ఎవరు..అన్న ప్రశ్న ఎదురైంది. దాంతో ఈ సినిమా బిజినెస్ పై ఇంపాక్ట్ పడింది. ఎవరూ కొనటానికి పెద్ద ఉత్సాహం చూపించలేదు. తమిళంలో 120 కోట్లు చేసిన ఈ సినిమా తెలుగులో రెండు కోట్లు దాటి బిజినెస్ చేయటం కూడా కష్టమైపోయింది.
తెలుగులో ఈ సినిమాను మార్చి 1 వ తేదీన రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తున్నది. తమిళంలో ఈ సినిమా దాదాపు రూ.120 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. తెలుగులో 2.60 కోట్లు వరకూ బిజనెస్ చేసి షాక్ ఇచ్చింది. మినిమం ఏడెనిమిది కోట్ల బిజినెస్ అయినా అవుతుందని అంచనా వేసారు. కానీ ఫలితం లేదు.
ఏరియా ప్రి రిలీజ్ బిజినెస్ (కోట్లలో )
——————- ———————————
నైజాం 0.60
సీడెడ్ 0.50
ఆంధ్రా 1.50
ఆంద్రా, తెలుగు కలిపి 2.60
జిత్ సరసన లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ అసోషియేషన్‌తో ఎన్.ఎన్.ఆర్ ఫిలింస్ పతాకంపై ఆర్.నాగేశ్వరరావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ చిత్రంలో తెలుగు నటుడు జగపతిబాబు పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. శివ గత సినిమాల్లోలాగానే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కు ప్రాధాన్యత ఇచ్చారు.
నయనతార, జగపతిబాబు, వివేక్, తంబి రామయ్య, యోగిబాబు, రోబో శంకర్, కోవైసరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ పతాకంపై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్‌లు నిర్మిస్తున్నారు.