‘మహానాయకుడు’ మొదట రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చు?

నందమూరి తారక రామారావు జీవితాధారంగా ఆయన కుమారుడు బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషించిన చిత్రం ‘యన్‌.టి.ఆర్‌.’ క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కింది. ఈ సినిమా తొలి భాగం ‘కథానాయకుడు’ క్రితం నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ చిత్రం రెండో భాగం ‘మహానాయకుడు’రిలీజ్ విషయంలో ఖచ్చితంగా కంగారుగానే ఉంటుంది టీమ్ కు.

ఈ నేపధ్యంలో ‘మహానాయకుడు’బిజినెస్ విషయంలో ఏ మేరకు ఓపినింగ్స్ వస్తాయనే విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది. ‘కథానాయకుడు’చిత్రం ఏడు కోట్లు మొదటి రోజు మొదట రోజు ఓపెన్ చేస్తే ..రెండో రోజు కు వచ్చేసరికి అది కోటిన్నర కు పడిపోయింది. ఇక మూడో రోజుకు వచ్చేసరికి అది నలభై లక్షలుకు దిగిపోయింది. దాంతో సెకండ్ పార్ట్ కలెక్షన్స్ ఎలా ఉండబోతాయన్నది ట్రేడ్ లో చర్చ మొదలైంది.

కొంతమంది ట్రేడ్ విశ్లేషకులు అంచనా ప్రకారం తొలి రోజు రెండు కోట్లు వరకూ మహానాయకుడు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ‘కథానాయకుడు’కు ఉన్న అంచనాలు ఏమీ ఈ సినిమాపై లేవు. తెలుగు దేశం అభిమానులు, బాలకృష్ణ ఫ్యాన్స్ మొదట రోజు చూస్తారు. సామాన్య ప్రేక్షకులు ఈ సారి అంతలా ఆవేశపడి వెళ్లిపోరు. హిట్ టాక్ స్ర్పెడ్ అయితేనే సినిమాకు మనుగడ.

ఎన్‌.బి.కె ఫిల్మ్స్‌, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియాలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తొలి భాగం ‘కథానాయకుడు’లో ఎన్టీఆర్‌ సినీ ప్రస్థానం నుంచి తెలుగుదేశం పార్టీ ప్రకటన వరకూ చూపించారు. రెండో భాగం ‘మహానాయకుడు’లో ఆయన ఎలా పార్టీని స్థాపించారు? ప్రజాదరణతో ఎలా ముఖ్యమంత్రి అయ్యారు? తదితర పరిణామాలను చూపించనున్నారు. తొలి భాగంతో పోలిస్తే, రెండో భాగంపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చంద్రబాబునాయుడు పాత్రలో రానా ఎలా మెప్పించారో ఇందులో చూడవచ్చు.