‘సాహో’ డిస్ట్రిబ్యూటర్లు పరిస్దితి ఏంటి?!

హిందీలో ‘సాహో’ ఓకే కానీ …మన దగ్గరే..

బాహుబలి తరువాత ఆల్ ఇండియా స్టార్ గా ఎదిగారు రెబల్ స్టార్ ప్రభాస్. తాజాగా ఆయన హీరోగా సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా రూపొందిన భారీ యాక్షన్ చిత్రం `సాహో`. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన సినిమా ఓపినింగ్స్ అదిరిపోయాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో అంతగా వర్కవుట్ కాకపోయినా హిందీలో మాత్రం క్రియేట్ చేస్తోంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా హిందీలో 150 కోట్లు దాకా వసూలు చేసింది.

ఇక ‘సాహో’ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి, టాప్-5 అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచినా, ఓవర్సీస్ లో మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలనే మిగల్చనుందని అంచనా. వాస్తవానికి ఈ సినిమాకు కాస్తంత నెగటివ్ టాక్ వచ్చినా, కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. మరో పెద్ద హీరో సినిమా లేకపోవడం, ‘సాహో’కు ప్లస్ పాయింట్ అయింది. దీంతో కలెక్షన్లు భారీగానే వచ్చాయి.

మరో ప్రక్క ఓవర్ సీస్ లో మూడు మిలియన్ డాలర్ల మార్క్ ను అధిగమించిన తెలుగు సినిమాలు కేవలం ఐదు. వాటిల్లో మూడు ప్రభాస్ వే, బాహుబలి రెండు భాగాలతో పాటు, రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు 3 మిలియన్ డాలర్ల మార్క్ ను క్రాస్ చేయగా, ఇప్పుడు సాహో ఆ ఫీట్ ను అందుకుంది.

కానీ, ఈ చిత్రాన్ని 6 మిలియన్ డాలర్లకు విదేశీ హక్కులను పొందిన డిస్ట్రిబ్యూటర్లు, మిగతా మూడు మిలియన్లను సాధించడం దాదాపు అసాధ్యమే. సినిమా విడుదలై మూడు వారాలు దాటిపోవడంతో, సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల సంఖ్య తగ్గిపోయింది. మరో రెండు వారాల తరువాత చిరంజీవి ‘సైరా’ వచ్చేస్తుంది. దీంతో ‘సాహో’ విదేశీ డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కడం కష్టమే అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.