‘సాహో’ రెండో రోజు కలెక్షన్స్ పెరిగాయా..తగ్గాయా
‘బాహుబలి’తో తన సత్తా ఏంటో చూపించిన ప్రభాస్ ఇప్పడు ‘సాహో’ అంటూ మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే డివైడ్ టాక్ వచ్చింది. అయితే ప్రీ రిలీజ్ హైప్ తో ఓ రేంజి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఆ టాక్ చూసిన వాళ్లంతా సెకండ్ డే పూర్తి డ్రాప్ అయ్యిపోతుందని అంచనా వేసారు. ముఖ్యంగా హిందీ వెర్షన్ కు గానూ ఈ సినిమా కు బాగా నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. దాంతో దాదాపు అక్కడ వాష్ అవుట్ అనే పరిస్దితి క్రియేట్ అయ్యింది.
కానీ ఆశ్చర్యంగా మొదటి రోజు కన్నా రెండో రోజు వీకెండ్ ఎడ్వాంటేజ్ తో 26 కోట్ల షేర్ ని రాబట్టి షాక్ ఇచ్చింది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ వీకెండ్ హింది వెర్షన్ కు గానూ 70 కోట్లు దాకా రాబడుతుందని, వినాయిక చవితి శెలవు కావటంతో మరో ముప్పై వస్తాయని, 100 కోట్లు దాకా వచ్చే అవకాసం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు వచ్చిన టాక్‌తో ఆక్యుపెన్సీ తగ్గకుండా ఈ రేంజ్ కలెక్షన్స్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ కలెక్షన్స్ చూసిన ప్రభాస్ చాలా ఉత్సాహంగా ఉన్నారట. తన నెక్స్ట్ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చెయ్యాలనే ఆలోచనతో ఉన్నారట.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..రెండో రోజు ‘సాహో’ కాస్త వేగం తగ్గినట్లు కన్పిస్తోంది. మార్నింగ్ షో, మ్యాటనీ వరకూ కాస్త డల్‌గా వున్నా, ఆ తర్వాత వసూళ్ళు పుంజుకున్నాయి. ఆదివారం.. అంటే ఈ రోజు వసూళ్ళ ప్రభంజనం కనిపిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రేపు ఎలాగూ వినాయక చవితి సెలవు కావడంతో, ‘సాహో’కి తిరుగు లేదన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఓవర్ సీస్ లో మాత్రం ఇక పుంజుకునే అవకాసం లేదంటున్నారు.