అమెరికాలో ‘సాహూ’ ని భారీ నష్టం, కారణం ఎవరంటే..

అమెరికాలో ‘సాహూ’ భారీ నష్టానికి కారణం ఇదే

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహోకు అమెరికా బాక్సాఫీస్ కలెక్షన్లు షాక్ ఇచ్చాయని ట్రేడ్ ఎనలిస్ట్‌లు తేల్చారు. అప్పటికీ అమెరికాలో సాహో సినిమాకు మంచి వసూళ్లు రావాలని పంపిణీదార్లు స్పెషల్ ప్రీమియర్ షోలు కూడా నిర్వహించారు. ప్రివ్యూలకు వచ్చిన రెస్పాన్స్ విడుదలైన రోజు మాత్రం రాకపోవడం గమనార్హం. అయితే సినిమా తొలిరోజు వసూళ్లు ‘మహర్షి’ సినిమాను బీట్ చేశాయి. కానీ ఫలితం లేకుండాపోయింది.

సాహూ ఎట్టకేలకు రెండవ శనివారం నాటికి యూఎస్ లో 3 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. దీంతో ఈ చిత్రం, ‘బాహుబలి 2’ 12 మిలియన్, బాహుబలి 6.9 మిలియన్, రంగస్థలం 3.5 మిలియన్ మరియు భరత్ అనే నేను 3.4 మిలియన్ ల జాబితాలో చేరింది. అయితే ఆదివారంతో సినిమా రన్ దాదాపుగా పూర్తి అయిపోయింది. ఈ సినిమా అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్లాప్ అనే చెప్పుకోవాలి.

వాస్తవానికి బ్రేక్ ఈవెన్ కు అక్కడ దాదాపుగా ఎనిమిదని మిలియన్ డాలర్లు రాబట్టాల్సి ఉంది, అయితే కనీసం సగం కూడా పని అవ్వలేదు. ఈ పెర్ఫార్మన్స్ కు సినిమా డిస్ట్రిబ్యూటర్ కూడా కారణమే అంటున్నారు. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల సరైన ఓపెనింగ్ కూడా రాబట్టలేకపోయింది.

ఇక సాహో హిందీ థియేట్రికల్ రైట్స్‌ను ఫార్స్ ఫిలింస్ సంస్థ దాదాపు రూ.42 కోట్లకు విడుదల చేసింది. అమెరికాలో యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ ద్వారా హిందీ వెర్షన్‌ను విడుదల చేసింది. కానీ సినిమాకు కావాల్సినంత ప్రచారాన్ని మాత్రం వారు కల్పించకపోవడం మరో మైనస్ పాయింట్‌గా నిలిచింది.

అయినా అమెరికాలో తెలుగు వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి తెలుగు వెర్షన్స్‌కు స్క్రీన్లు ఎక్కువగా ఉండాలి. కానీ వైఆరఎఫ్ సంస్థ తెలుగుకు బదులు హిందీ వెర్షన్‌కు ఎక్కువ స్క్రీన్లను ఏర్పాటుచేసింది. డిస్ట్రిబ్యూటర్లు తమిళ వెర్షన్‌కు కేటాయించిన స్క్రీన్లలో కొన్ని స్క్రీన్లను తెలుగు వెర్షన్ కోసం కేటాయించి ఉంటే కలెక్షన్లు బాగానే ఉండేవంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.