Home Box Office ‘సాహో’అసలైన అగ్ని పరీక్ష ఈ రోజే

‘సాహో’అసలైన అగ్ని పరీక్ష ఈ రోజే

‘సాహో’ఈ రోజు నుంచే అసలు కథ మొదలు

బాహుబలి చిత్రం తర్వాత అదే స్దాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ‘సాహో’ . ఈ సినిమా మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ప్రేక్షకుల నుండి మొదటి రోజు నుంచి డివైడ్ టాక్ వచ్చింది.

రివ్యూలు నెగటివ్ గా ఉన్నా నార్త్ లో మాత్రం ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ నెలకొంది. టాక్ సంగతి ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం కొదవలేదు. అయితే అందుకు కారణం … ఈ సినిమాకి దక్కిన ప్రీ రిలీజ్ హైప్. ఆ హైప్‌తోనే ఈ సినిమాకి భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగాయి. అందుకే సినిమా టాక్ ఎలా ఉన్నా సినిమా కలెక్షన్స్‌కు మాత్రం పెద్దగా ఎఫెక్ట్ కాలేదు.

అంతే కాదు ‘బాహుబలి’ రెండు సినిమాలతో నార్త్ ఆడియన్స్ అంతా ప్రభాస్‌కి కనెక్ట్ అయిపోవటం కలిసొచ్చింది. అందుకే ఈ సినిమా అక్కడ భారీగా వసూళ్లు రాబడుతుంది. మొత్తంగా సినిమా మొదటి మూడు రోజులకు గాను రూ. 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది అని నిర్మాతలే ప్రకటించారు. అయితే ఇన్ని రోజులు ఒకెత్తు ..ఈ రోజు నుంచి కలెక్షన్స్ ఎలా ఉంటాయనేదానిపై సినిమా అసలు రిజల్ట్ ఏంటనేది ఆధారపడి ఉంటుంది.

అయితే ఈ సినిమా ఇప్పటిదాకా ఫాల్ అనేది లేదు. అయితే రికార్డ్ రేట్లకు డిస్ట్రిబ్యూటర్స్ సినిమాని అడ్వాన్స్ బేసిస్ లో తీసుకోవటంతో మరో రెండు వారాలు పాటు ఇదే పరిస్దితి కొనసాగాలి. అందుకు ఈ రోజే నాంది పలకాలి. అప్పుడే అందరూ సేవ్ అయ్యి..లాభాల్లో పడతారు. అప్పుడు సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ క్రింద లెక్క. ఇప్పటికే ఈ సినిమా హిందీ వెర్షన్ హిట్ క్రింద డిక్లేర్ అయ్యిపోయింది. హిందీ వెర్షన్ …వందకోట్లు క్లబ్ లో ఈ రోజు చేరనుంది .

- Advertisement -

Related Posts

యాంకర్ ప్రదీప్ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

యాంకర్ గా బుల్లితెరపై దశాబ్ద కాలంగా ఎంతగానో క్రేజ్ అందుకుంటున్న ప్రదీప్ మాచిరాజు మొత్తానికి వెండితెరపై కథానాయకుడిగా ఎంట్రీ ఇవ్వడబికి సిద్ధమయ్యాడు. 30రోజుల్లో ప్రేమించడం ఎలా? ఈ 29కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

అల్లుడికి అల్లరోడికి డెడ్ లైన్.. రూ.2కోట్లు తెచ్చారంటే..

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కొంతమంది హీరోలకు బాగానే కలిసొచ్చింది. బయటవాడైన విజయ్ మాస్టర్ సినిమాతోనే తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు. ఇక క్రాక్ తో మాస్ రాజా బాక్సాఫీస్ వద్ద...

క్రాక్ లెక్క.. పది రోజులకు పది కోట్లు!

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజను తక్కువ అంచనా వేసినవారే ఇప్పుడు ఆయన వెంటపడి డేట్స్ ఇస్తే అడిగినంత ఇస్తామని అంటున్నారు. మొన్నటివరకు రెమ్యునరేషన్ కూడా ఎక్కువే అన్నవాళ్ళు కూడా ఇప్పుడు డైరెక్టర్ గోపిచంద్...

Box office: విజయ్ మరో 150.. ఇది మామూలు దెబ్బ కాదు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న టాప్ హీరోల్లో ఒకరని మరోసారి ఋజువయ్యింది. తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్టార్ హీరో తన...

Latest News