షాకింగ్ రేటుకు ‘సైరా’ నైజాం రైట్స్

‘సైరా’ నైజాం రేటు ఎంత చెప్తున్నారంటే…

సైరా రిలీజ్ టైమ్ దగ్గరపడింది. మరో పదిరోజుల్లో సినిమా రిలీజ్ కానుంది.మొన్న ట్రైలర్ రిలీజ్ దాకా స్ధబ్దుగా ఉన్న మార్కెట్ ఒక్కసారిగా క్రేజ్ పుంజుకుంది. దాంతో ట్రేడ్ వర్గాల్లో సైరాకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో ఈచిత్ర హక్కుల కొరకు డిస్ట్రిబ్యూటర్స్ మధ్య తీవ్ర పోటీ పెరిగిపోయింది. ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో అతిపెద్ద మార్కెట్ అయిన నైజాం హక్కుల కొరకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీపడుతున్నాయని వినిపిస్తోంది.

అందుతున్న సమాచారం మేరకు ..ఇప్పటికే ఈ చిత్ర నిజాం హక్కులు 35కోట్ల వరకు పలికాయని తెలుస్తుంది. కాగా సైరా మేకర్స్ 40కోట్లకు నైజాం హక్కులను అమ్మాలనే ఆలోచనలో ఉన్నారని వినికిడి. సినిమా హిట్ అయితే ఈ అంకె పెద్ద విషయం కాదు. మహేష్ మహర్షి సినిమా కి నైజాం లో జిఎస్టీ కాకుండా 26 కోట్ల వరకు వచ్చింది. ఇప్పుడు సైరా భారీ చిత్రం కాబట్టి హిట్ అయితే 40 కోట్లు ఆడుతూ పాడుతూ వచ్చేస్తాయని ట్రేడ్ చెబుతుంది.

ఇక చిత్రం విషయానికి వస్తే..మెగాస్టార్ చిరంజీవి హీరోగా దాదాపు 250కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిందీ చిత్రం. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషలలో విడుదల అవుతుంది. అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి వారు నటించడంతో సైరా పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో నయనతార, తమన్నా హీరోయిన్స్ గా ప్రాధాన్యం ఉన్నపాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది అందిస్తున్నారు.